Munugode Congress : తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికలకు సరిగ్గా పది రోజుల సమయమే ఉంది. వారం రోజుల్లో ప్రచారం ముగియనుంది. దీంతో మూడు పార్టీలు మునుగోడును తమ ఖాతాలో వేసుకునేందుకు సర్వశక్తులు ఒడుతున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ఇప్పటికే ఫిరాయింపులను టీఆర్ఎస్, బీజేపీ ప్రోత్సహిస్తున్నాయి. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఉన్నంతలో ప్రయత్నం చేస్తోంది. అయితే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండడంతో పార్టీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.

-కాంగ్రెస్‌కు కష్టమే..
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్తో కాంగ్రెస్ మునుగోడులో హోరాహోరీగా తలపడుతోంది. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్‌కు మునుగోడులు కష్టమే అన్న వాదన వినిపిస్తోంది. ఎనిమిదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో అధికార పార్టీతో తలపడేంద ఆర్థిక స్థోమత లేదు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్తో పోలిస్తే ఖర్చు తక్కువగానే పెడుతోంది. మరోవైపు సొంత పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంలో విఫలమవుతోంది. అధికారానికి, ఆదాయానికి ఇంతకాలం దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలు పార్టీ మారేందుకే ఆసక్తి చూపుతున్నారు. సర్పంచుల నుంచి ఎంపీటీసీలు, ఎంపీపీ వరకు ఎవరు ఎక్కువ చెల్లిస్తే ఆ పార్టీలోకి దూకుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీపీ పల్లె రవిగౌడ్, అతని భార్యను ఇటీవలే టీఆర్ఎస్ కొనుగోలు చేసింది. ఇందుకు రూ.20 కోట్ల డీల్ కుదిరినట్లు సమాచారం. ఇక సర్పంచులు, ఎంపీటీసీలకు వారి బలాలను బటి టీఆర్ఎస్, బీజేపీ రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు చెల్లిస్తున్నాయ. ఇక్కడ రెండు అధికార పార్టీలు కాంగ్రెస్‌నే టార్గెట్ చేశాయి. దీంతో మునుగోడులు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త మినహా అటూ ఇటుగా ఉన్నవారంతా పారీ మారారు. దీంతో సిట్టింగ్ సీటును కాపాడుకోవడం కాంగ్రెస్‌కు కష్టంగా మారింది.
-కోవర్టుగా కొందరు..
చోటామోటా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఇప్పటికే పార్టీలు మారారు. ఇక మిగిలిన కాంగ్రెస్ నేతల్లో చాలామంది అధికార పార్టీలకు కోవర్టుగా పనిచేస్తున్నారు. ఇందుకు భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా అతీతుడు కాడు. కాంగ్రెస్‌లో ఉన్న ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులకు పోన్‌చేసి బీజేపీకి ఓటు వేయాలని సూచిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్ పదవిలో ఉండి కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేయాల్సిన వెంకటరెడ్డి విదేశాలకు వెళ్లిపోయారు. అక్కడ కూడా మునుగోడులో కాంగ్రెస్ గెలవదు అంటూ సన్నిహుతలతో మాట్లాడుతున్నారు. ఎంపీ స్థాయిలో ఉన్న నాయకుడే ఇలా ఉంటే ఇక కిందిస్థాయి నేతల పరిస్థితి ఎమిటో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌లో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్న చాలామంది నాయకులు టీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎంతో కొంత తీసుకుని ఎన్నికల నాటికి తమతోపాటు తమ వెంటున్న నాయకుల ఓట్లుల కూడా ఆయా పార్టీల అభ్యర్థులకు వేయించే పనిలో ఉన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కొంత మంది అమ్ముడు పోయారని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
-తత్వం బోధపడి..
మునుగోడు ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును నిలబెట్టుకుని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేంత్‌రెడ్డి భావించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. వీలైనంత వరకు ఖర్చుకు కూడా వెనుకాడలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వాస్తవ పరిస్థితి ఏమిటో టీకాంగ్రెస్ నేతలకు అర్థమవుతోంది. ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా గెలుపుపై విశ్వాసంగా లేరు. వాస్తవ పరిస్థితులు, ఓటమి కళ్ల ముందే కనబడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
-బీజేపీని ఓడించాలని…
మునుగోడులో తమ ఓటమి ఎలాగో ఖాయమైందన్న నిర్ణయానికి వచ్చిన టీపీసీసీ తన పార్టీని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు కారణమైన రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలని భావిస్తున్నారు. బీజేపీ గెలవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న సందేశం కూడా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంతో తాము గెలవక పోయినా పరవా లేదు.. తమకు పోటీగా ఎదుగుతున్న బీజేపీ గెలవకూడదన్న నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినటు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 3న జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, మద్దతు దారులు టీఆర్ఎస్కే ఓటు వేయాలని కోరాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇది ప్రచారం జరుగకుండా జాగ్రత్త పడాలని టీపీసీసీ నేతలు క్యాడర్‌కు సూచించినట్లు తెలుస్తోంది. ప్రచారం ముగియడానికి రెండు రోజుల ముందు నుంచి ఈ మేరకు ఓటర్లకు, కాంగ్రెస్ మద్దతు దారులకు సూచించాలని ఇప్పటికే క్యాడర్‌కు అంతర్గత సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ పాదయాత్ర వేళ మునుగోడులో కాంగ్రెస్ ఓడినా బీజేపీ గెలువొద్దన్నదే ప్రస్తుతం టీపీసీసీ లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.