Richest MLAs and MPs : గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు మన రాజకీయ రంగం కనిపిస్తోంది. నాడు ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ఇచ్చింది. చెప్పేదానికి చెప్పేదానికి ఎక్కడా పొంతన ఉండదు..ఇందిరాగాంధీ హయాంలోనే దేశంలో పేదరికం పెరిగింది. ఇప్పటికీ కాంగ్రెస్ పాలన కాలంలోనే దేశంలో పేదరికం రేటు బాగా ఉంది. బీజేపీ వచ్చాక పేదరిక నిర్మూలన జరిగింది. ప్రస్తుతం లెక్కలు కూడా అవే చెబుతున్నాయి.
తాజాగా ప్రజాస్వామ్య పార్టీలు, ధనవంతులపై ఏడీఆర్ చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దేశంలోని ఎంపీలలో టాప్ 10 చూసుకుంటే టాప్ 3 కాంగ్రెస్ ఎంపీలే.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కొడుకు నకుల్ నాథ్ 660 కోట్లతో దేశంలోనే సంపన్న ఎంపీగా ఉన్నారు. తర్వాత ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలే. 4వ స్థానంలో మన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు 325 కోట్లతో ఉన్నారు. 5వ స్థానంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. బీజేపీ నుంచి హేమమాలిని 250 కోట్ల సంపదతో 6వ స్థానంలో ఉన్నారు. ఈమె సినీ రంగం నుంచి రావడంతోనే బీజేపీ నుంచి ఈ ఒక్క స్థానం సాధించారు. స్వతహాగా బీజేపీ నేత ఈమె కాదు. టాప్ 10లో బీజేపీ నుంచి సంపన్న ఎంపీ ఒకే ఒక్కరు. ఎమ్మెల్యేలు చూసుకున్నా కాంగ్రెస్ నేతలే టాప్ లో ఉన్నారు.
పేదల గురించి ఎక్కువగా మాట్లాడేది.. పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీనే. ఈ పార్టీ ఇప్పుడు పేదరికం నుంచి మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. టాప్ 10లో ఉన్న టాప్ 3 కాంగ్రెస్ ఎంపీలే. వీళ్లు బీజేపీ ధనవంతుల పార్టీ అని మాట్లాడుతారు.. జనాలు ఇదే నమ్ముతారు. కానీ అసలు నిజం ఇదీ..
దేశంలో కాంగ్రెస్ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.