Chiranjeevi Pawan kalyan : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ వీర విహారం ఇంకా కొనసాగుతూనే ఉంది..ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి నీరాజనాలు పలుకుతున్నారు..థియేటర్స్ కి ఈ రేంజ్ మ్యాడ్ రష్ #RRR చిత్రం తర్వాత మళ్ళీ ‘వాల్తేరు వీరయ్య’ కే మనం చూస్తున్నాము.

కేవలం రెండు వారాల్లోనే 130 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకొని నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ వైపు పరుగులు తీస్తున్న ఈ సినిమా కి విజయోత్సవ సభ లేకుంటే అసలు బాగుండదు కదూ..అందుకే మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు ‘వీరయ్య విజయ విహారం’ పేరిట వరంగల్ లోని ఆర్ట్స్ కాలేజీ లో వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిపారు ..ఈ ఈవెంట్ కి చిరంజీవి తో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఇక ఈ విజయోత్సవ వేడుక లో మెగాస్థార్ చిరంజీవి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..ఆయన మాట్లాడుతూ ‘బాబీ నా ఫ్యాన్ అని చెప్తూ ఉంటాడు..కానీ ఈ సినిమాలో ఆయన పనితనాన్ని చూసి నేను బాబీ కి పెద్ద ఫ్యాన్ అయ్యిపోయాను..ఇక ఈ సినిమాకి ఆయువుపట్టులాగా నిల్చిన నా తమ్ముడు రవితేజ గురించి చెప్పుకోవాలి..అతను ఒక స్టార్ హీరోగా ఎంతో బిజీ..క్షణ కాలం తీరిక ఉండదు..అలాంటిది నేను అడగగానే వెంటనే నా కోసం ఒప్పుకొని ఈ సినిమా చేశాను..రవితేజ ని చూస్తే నా తమ్ముడు పవన్ కళ్యాణే గుర్తుకొస్తాడు..యంగ్ ఏజ్ లో ఇద్దరూ ఒకేలాగా ఉండేవారు..డైరెక్టర్ బాబీ నాతో అంటూ ఉండేవాడు..అన్నయ్య గ్లిసరిన్ లేకుండా ఎలా అన్నయ్య అంత సహజంగా చేసావు అని అడిగాడు..అప్పుడు నేను రవితేజలో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చూసుకున్నాను.. చనిపోతున్న సన్నివేశం లో నా తమ్ముడు చనిపోతున్నట్టే నేను ఊహించుకున్నాను..అందుకే అంతలా నాకు ఏడుపు వచ్చింది’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.