Chandrababu’s political asceticism : రాజకీయాల్లో సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి రెండు సార్లు..ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ కి ఒకసారి.. మొత్తం మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు భావితరానికి దిక్సూచి లాంటివని చెప్పొచ్చు.. నందమూరి తారకరామారావు తర్వాత తెలుగు దేశం పార్టీ ఈ స్థాయిలో ఇప్పటికి ప్రధాన పార్టీగా కొనసాగుతుంది అంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు.. అయితే ప్రస్తుతం ఆయన వయస్సు 72 ఏళ్ళు.

చంద్రబాబు నాయుడికి వయసు పైబడుతుండడంతో తెలుగుదేశం పార్టీకి జనాల్లో ఆదరణ తగ్గిపోతోంది.. మునుపటిలా యాక్టివ్ గా ఆయన ప్రజల్లో పోరాడడం లేదు. ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఆయన వారసుడు లోకేష్ లో ఆ శక్తిసామర్థ్యాలు లేవు. గత సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం అవ్వడం అందరిని షాక్ కి గురిచేసింది.. తెలుగుదేశం పార్టీకి ఇంత ఘోరమైన ఫలితం గతంలో ఎప్పుడు కూడా రాలేదు.. అధికారంలో ఉన్న పార్టీకి.. అంత క్యాడర్ ఉన్న పార్టీ కి ఈ ఫలితం అంటే చాలా ఘోరం అనే చెప్పాలి.
ఇక అసెంబ్లీ లోకి అడుగుపెట్టిన తర్వాత అయితే చంద్రబాబుకి ఇంకా ఘోరమైన అవమానాలు జరిగాయి.. వైసీపీ వాళ్ళు చంద్రబాబు కుటుంబ సభ్యులపై నీచంగా తిట్టడంతో ఆయన అసెంబ్లీని బాయ్ కాట్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీ లోకి అడుగుపెడుతానని శపధం చేసాడు.. అయితే తాజాగా చంద్రబాబు కర్నూలు జిల్లాలోని పత్తికొండ ప్రాంతంలో పర్యటించారు..అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం గా మారాయి.
బాబు మాట్లాడుతూ ‘రాజకీయాల్లో ఇంత అనుభవం ఉన్న నన్ను.. మూడు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నన్ను.. నా భార్య ని అసెంబ్లీ లో ఘోరంగా అవమానించారు..అది గౌరవ సభ కాదు..కౌరవ సభ.. మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచి దానిని గౌరవ సభగా మారుస్తాను.. మీరు గెలిపించి నన్ను అసెంబ్లీ కి పంపితే సరే..లేదంటే ఇదే నా చివరి ఎన్నికలు ‘ అంటూ చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
చంద్రబాబుది ఇదే చివరి ఎన్నికలు అని.. ఆయన వయసు వచ్చే ఎన్నికల నాటికి 77 ఏళ్లకు చేరుతుందని.. వృద్ధాప్యం దరిచేరుతుంది కాబట్టే ఆయన ఈ ఒక్క ఛాన్స్ కోసం ఈ సంచలన ప్రకటన చేసినట్టు తెలుస్తోంది.