Brahmastra Trailer Review: దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ‘గ్రాఫిక్’ ప్రపంచాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు సరికొత్త కథలు.. వినూత్న శక్తులతో దేశంలో సినిమాలొస్తున్నాయి. బాహుబలితో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిన జక్కన్నను స్ఫూర్తిగా తీసుకొని.. అతడిని సమర్పకుడిగా పెట్టుకొని మరీ బాలీవుడ్ యువ దర్శకుడు అయాన్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘బ్రహ్మస్త్రం’. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి అందరికీ గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది. ఒక అద్భుత దివ్యశక్తుల లోకాన్ని ప్రజలకు పరిచయం చేస్తోంది. భారతీయ ఇతిహాసాలు, శక్తుల నుంచి ఈ కథను అల్లుకున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

బ్రహ్మస్త్ర ట్రైలర్ చూస్తే ‘నీరు , నిప్పు, మంచు’కి అస్త్రాలుగా ఉండేవారి కథనే ఈ ‘బ్రహ్మాస్త్ర’ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో నిప్పుగా హీరో రణబీర్ కపూర్, నీరుగా మన టాలీవుడ్ హీరో నాగార్జున, ఇక మంచుగా అమితాబ్ బచ్చన్ నటించినట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురు ఈ భూమిని కాపాడేందుకు.. బ్రహ్మస్త్రాన్ని రక్షించేందుకు పాటుపడ్డట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురి కలయికతోనే హీరో రణబీర్ కపూర్ బ్రహ్మస్త్రను రక్షిస్తాడని తెలుస్తోంది.
Also Read: Hari Hara Veera Mallu: ఈ నెల 22వ తారీఖు నుండి పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు
మెయిన్ విలన్ పాత్రలో మౌనీ రాయ్ నటిస్తుండగా.. రణబీర్ కు సాయం చేసే క్యారెక్టర్ గా అమితాబ్ వచ్చన్ కనిపించారు.హాలీవుడ్ రేంజ్ లో ఫుల్ గా గ్రాఫిక్స్ దట్టించిన ఈ మూవీ ట్రైలర్ కళ్లు జిగేల్ మనేలా ఉంది.

ప్యాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ ‘బ్రహ్మస్త్ర’ హిందీతోపాటు తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ సహా అన్ని భాషల్లో విడుదలవుతోంది. బాలీవుడ్ నుంచి వస్తున్న ప్యాన్ ఇండియా మూవీగా చెప్పొచ్చు. ట్రైలర్ మొత్తం గ్రాఫిక్స్ తో మ్యాజిక్ చేసేలా ఉంది.
Also Read: Naga Chaitanya: ఆ హీరోయిన్ తో పార్టీలు పబ్బులు.. అబ్బో .. నాగచైతన్య దగ్గరయ్యాడా?
సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతోంది. మొదటి పార్ట్ ఈ సంవత్సరం విడుదల కాబోతోంది. బ్రహ్మస్త్ర తెలుగు ట్రైలర్ కు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
ట్రైలర్ ను కింద చూడొచ్చు..