Bigg Boss 6 Telugu Raj Elimination : బిగ్ బాస్ సీజన్ 6 అంతా అవకతవకల మయంగా ఉంది. ఒక స్టాండ్, రూల్ అనేది లేకుండా పోయింది. ఆడియన్స్ అభిప్రాయం ఒకటైతే… హోస్ట్ నాగార్జున ఒపీనియన్ మరొకటి. ఒక కంటెస్టెంట్ విషయంలో చిన్న విషయాన్ని భూతద్దంలో చూసే నాగార్జున.. మరో కంటెస్టెంట్ పెద్ద తప్పు చేసినా, కనీసం దాని గురించి మాట్లాడరు. ఆయన అసలు షో చూస్తున్నారా లేక మేనేజ్మెంట్ ఇచ్చే నోట్స్ ఫాలో అవుతున్నారో ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. ఈ వారం ఎవరిని తిట్టాలో ఎవరిని పొగడాలో ముందుగానే ప్రిపేరై వస్తారేమో అనిపిస్తుంది.

ఈ క్రమంలో కొన్ని ఎలిమినేషన్స్ కూడా పలు అనుమానాలకు దారి తీశాయి. ఓట్ల ప్రాదిపదికనే ఎలిమినేషన్స్ జరుగుతున్నాయా అనే సందేహాలు కలిగాయి. గీతూ, బాల ఆదిత్య, సూర్య ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అన్న వాదన వినిపించింది. ఇక తాజా ఎలిమినేషన్ తీవ్ర వ్యతిరేకతకి దారి తీసింది. అసలు సీజన్ మొత్తం మీద ఆడియన్స్ కి నమ్మకం పోయేలా చేసింది. కంటెస్టెంట్ రాజ్ ని రూల్స్ కి విరుద్ధంగా బయటకు పంపేశారు.
అసలు ప్రాథమిక సూత్రం పక్కన పెట్టేశారు. రాజ్ ఎలిమినేషన్ లో అతిపెద్ద మిస్టేక్ జరిగినట్లు నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు. ఆధారాలు చూపిస్తూ అన్యాయం అంటూ నిలదీస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4లో ఇదే పరిస్థితి ఎదురైంది. హౌస్లో ఫ్రెండ్స్ గా ఉండే అరియనా-అవినాష్ డేంజర్ జోన్లో మిగిలారు. ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా అవినాష్ తన వద్ద ఉన్న ఎవిక్షన్ పాస్ తనకే వాడుకుంటానని చెప్పాడు. కాబట్టి ఒకవేళ అవినాష్ ఎలిమినేట్ అయితే ఎవిక్షన్ పాస్ వాడుకున్నాడు కాబట్టి ఇంట్లో ఉంటాడు. అరియనా ఎలిమినేట్ అయితే తాను బయటకు వెళ్ళిపోతుందని నాగార్జున చెప్పాడు.
రంగులు ఉన్న పాత్రలో చేతులు ఉంచిన అవినాష్, అరియానా బయటకు తీశారు. రెడ్ కలర్ అవినాష్ చేతికి అంటి ఉంది. గ్రీన్ కలర్ అరియనా చేతికి ఉంది. సో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. అవినాష్ ది గుడ్ డెసిషన్ అని మెచ్చుకున్న నాగార్జున నీ పాస్ వేరే వాళ్లకు వాడితే ఎలిమినేట్ అయ్యేవాడివి అన్నాడు. సీజన్ 4 ప్రకారమైతే రాజ్, ఫైమా ఇద్దరూ సేవ్ కావాలి. ఫైమా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్, ఎవిక్షన్ పాస్ ఉన్న ఫైమా సేవ్ అయినట్లు లెక్క.
కానీ రాజ్ విషయంలో రూల్ మార్చేశారు. యు ఆర్ ఎలిమినేటెడ్ అంటూ బయటకు పంపేశారు. గత సీజన్లో ఎవిక్షన్ ఎలా వాడారో నిర్వాహకులకు గుర్తు లేదా? లేక పోతే సీజన్ సీజన్ కి రూల్స్ మారిపోతాయా అంటూ నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆదిరెడ్డి చెప్పినట్లు ఎవిక్షన్ పాస్ వలన ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తంగా రాజ్ ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ మేకర్స్ అడ్డంగా దొరికిపోయారు. 21 మంది కంటెస్టెంట్స్ తో ఈ సీజన్ మొదలైన నేపథ్యంలో… ఫైనల్ దగ్గరకు వస్తుండగా ఇష్టం వచ్చినట్లు ఎలిమినేట్ చేస్తున్నారు. ఇంకా మూడు వారాల గేమ్ మాత్రమే ఉంది. దీంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందంటున్నారు.
#BiggBossTelugu4 lo#avinash Eviction Free pass use chesi save aithe #Ariyana ni eliminate cheyaledhu kadha
Now #BiggBossTelugu6 wanted ga #Raj ni elimination cheyali ani wanted ga chesaru
Anduke ga Hotstar lo ee video lepesaaru,Donga @DisneyPlusHSTel
RAJ EKKADUNNA RAJE pic.twitter.com/E0J9NB3rxT
— S (@UrsShareef) November 27, 2022