https://oktelugu.com/

BJP New State Presidents : ఇటీవల బీజేపీ నలుగురు రాష్ట్ర అధ్యక్షుల మార్పు దేనికి సంకేతం?

మోడీ మార్క్ 2014 నుంచి మార్పులు కనిపిస్తున్నాయి. యాడెడ్ ప్లేవర్స్ వచ్చాయి. సమాజంలో దాదాపు మెజార్టీ ఉన్న వెనుకబడిన వర్గాలకు గణనీయమైన ప్రాధాన్యత పెరిగింది. గాంధీ, దీన్ దాయల్, రామ్ మనోహర్ లోహియా వంటి వెనుకబడిన వర్గాల సిద్ధాంతాలకు పెద్దపీట వేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : July 5, 2023 / 05:35 PM IST
    Follow us on

    BJP New State Presidents : దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ నాలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది. అసలు ఎందుకు మార్చింది.. బీజేపీలో క్రమక్రమంగా వస్తున్న మార్పులు ఏమిటి? అన్న దానిపై లోతైన విశ్లేషణ చేసుకుందాం..

    బీజేపీ మొదలైందే హిందుత్వ సిద్ధాంతోనే.. భారత్ లో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలన్న దాంతోనే మొదలైంది. అలానే కశ్మీర్ తో సహా అందరికీ ఉండాలని బీజేపీ ని స్ట్రాట్ చేశారు. ఆర్డికల్ 371, అయోధ్య రామమందిరం.. వివక్ష లేని ప్రతి పౌరుడికి ఒకే సివిల్ కోడ్ ను తెస్తున్నారు. మేజర్ హిందుత్వ ఏజెండాను బీజేపీ పూర్తి చేసింది.

    మోడీ మార్క్ 2014 నుంచి మార్పులు కనిపిస్తున్నాయి. యాడెడ్ ప్లేవర్స్ వచ్చాయి. సమాజంలో దాదాపు మెజార్టీ ఉన్న వెనుకబడిన వర్గాలకు గణనీయమైన ప్రాధాన్యత పెరిగింది. గాంధీ, దీన్ దాయల్, రామ్ మనోహర్ లోహియా వంటి వెనుకబడిన వర్గాల సిద్ధాంతాలకు పెద్దపీట వేశారు.

    దీంతోపాటు పవర్ పాలిటిక్స్ ను మోడీ తెరపైకి తెచ్చారు. కేవలం కాంగ్రెస్ చేసిన ఈ పాలిటిక్స్ ను బీజేపీలోనూ అమలు చేస్తున్నారు మోడీ. పవర్ పాలిటిక్స్ లోనూ కాంగ్రెస్ కంటే ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఇది కూడా రాజకీయ క్రీడలో భాగమే. అందుకే దీన్ని విస్మరించకుండా రాజకీయం చేస్తున్నారు. అందుకే పదవుల పంపిణీ, కేటాయింపులోనూ మోడీ మార్క్ కనిపిస్తోంది. పవర్ గల నేతలు, సామాజికవర్గాలకు పదవులు ఇస్తున్నారు. అందుకే తాజాగా బీజేపీ అధ్యక్షులను మార్చారు.

    ఇటీవల బీజేపీ నలుగురు రాష్ట్ర అధ్యక్షుల మార్పు దేనికి సంకేతం? మోడీ ఎందుకు మార్చారు? దీని వెనుక కారణం ఏంటన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.