Bigg Boss 6 Telugu Raj Elimination : భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు ఊహించని మలుపులతో అదిరిపోయే టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతోంది..మరో మూడు వారాల్లో షో పూర్తి అయిపోతుండగా ఈ వారం చివరి కెప్టెన్ గా ‘ఇనాయ’ నిలిచినా సంగతి తెలిసిందే..ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి రాజ్ ఎలిమినేట్ అయ్యాడు..హౌస్ లోకి అడుగుపెట్టిన తొలిరోజుల్లో పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆ తర్వాత నుండి రాజ్ తన విశ్వరూపం చూపించేసాడు..హౌస్ లో ఉండేందుకు అన్ని విధాలుగా అర్హుడు అనే విధంగా రాజ్ తన ప్రాముఖ్యతని చాటుకున్నాడు.

అలాంటి రాజ్ ని టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా చూస్తామని అందరూ అనుకున్నారు కానీ..ఇప్పుడు టాప్ 9 కంటెస్టెంట్ గా మిగిలిపోతాడని ఎవ్వరు ఊహించలేదు..వోటింగ్ ప్రకారమైతే ఈ వారం ఫైమా ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది..ఎందుకంటే అందరికంటే అతి తక్కువ ఓట్లు ఆమెకే వచ్చాయి..హోస్ట్ అక్కినేని నాగార్జున పోలింగ్ ని కూడా చూపెట్టాడు..చివరి స్థానం లో ఫైమా ఉండగా, రాజ్ ఆమెకంటే కాస్త ఎక్కువ ఓట్లతో ముందంజలో ఉన్నాడు.

అయితే ఫైమా గత వారం లో ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ ని గెలుచుకోవడం వల్ల ఆమె ఎలిమినేషన్ నుండి తప్పించుకొని ఆమె తర్వాత తక్కువ ఓట్లు రప్పించుకున్న రాజ్ ఎలిమినేట్ అయ్యాడు..వాస్తవానికి పాపం ఫైమా ఆ ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ ని రాజ్ కోసం ఉపయోగించాలి అనుకుంటుంది..కానీ రాజ్ ఒప్పుకోడు..నువ్వు హౌస్ లో ఉండాలి ఫైమా..ఇది మీ అమ్మగారి కల..నేను వెళ్ళిపోతాను నాకేమి పర్వాలేదని చెప్తాడు..కానీ ఫైమా బోరుమని ఏడ్చేస్తుంది..పాస్ తీసుకోమని బ్రతిమిలాడుతుంది..కానీ రాజ్ ఒప్పుకోడు..నాగార్జున కూడా అలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పగా చివరికి ఫైమా తనకోసమే పాస్ ని ఉపయోగించి బయటపడుతుంది.
అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా ఇలాగే అవినాష్ కి ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ దొరుకుతుంది..ఆ పాస్ ని వాడి అవినాష్ ఎలిమినేషన్ ని తప్పించుకుంటాడు..ఇక ఆయన తర్వాత తక్కువ ఓట్లు రప్పించుకున్న అరియానా ని ఎలిమినేట్ చెయ్యకుండా..ఈ వీక్ ఎలిమినేషన్స్ లేవు అని నాగార్జున చెప్పేస్తాడు..కానీ అదే పరిస్థితి ఇప్పుడు రాజ్ విషయం లో వచ్చినప్పుడు మాత్రం ఎలిమినేట్ చేసేసాడు..ఇదెక్కడి న్యాయం అంటూ నెటిజెన్స్ బిగ్ బాస్ పై విరుచుకుపడుతున్నారు.