Behaviour Of Pawan, Chamdra Babu, Jagan : ఆంధ్రాలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లలో వ్యక్తిగతంగా ఎవరు మంచి నేత అని ఆలోచిస్తున్నారు. ఓటర్లు ఎన్నుకునేది నాయకుడిని కాదు.. ఎమ్మెల్యేలను.. నాయకుడిని ఎన్నుకునేది ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి ఆ పార్టీ ఏంటి? ఆ పార్టీ నేత ఎవరన్నది కీలకంగా చూస్తున్నారు.

అధ్యక్ష తరహా ఎన్నికలే దేశంలో నడుస్తోంది. ఉదాహరణకు 2014లో బీజేపీ అధికారంలోకి రావడానికి మోడీ మేనియానే కారణం.. ఇక ఢిల్లీ, పంజాబ్ లో వీధి వ్యాపారులు, సఫాయి కార్మికులు కూడా ఎమ్మెల్యేగా గెలవడానికి కేజ్రీవాల్ విశ్వసనీయత కారణం. 2019లో యోగి ఆధిత్యనాథ్ అధికారంలోకి రావడానికి ‘యోగి’ మేనియానే కారణం..
మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ శకం నుంచి చూస్తే.. పర్సనాలిటీలే డామినేట్ చేస్తున్నాయి. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ ల వ్యక్తిగత మేనియానే పనిచేసింది. మొన్నటి ఏపీ ఎన్నికల్లో జగన్ ను చూసి ముక్కుమొహం తెలియని వారిని కూడా ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిపించారు.మరి వీరికి ఓట్లు ఎందుకు వేశారు? ప్రజల విజ్ఞతను మనం అనుమానించాల్సి కాదు.
ఈ నేతలంతా వ్యక్తిగతంగా ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రజలను వేడుకున్నారు. హామీలిచ్చారు. కొన్ని పనులు చేస్తామని అన్నారు. ప్రత్యర్థులపై వ్యతిరేకత.. ఒక్క ఛాన్స్ అన్న ప్రాథేయపడ్డ తీరు కూడా మార్పు కోసం కొత్త వారికి అవకాశం ఇచ్చారు.
ఏపీలో పవన్, చంద్రబాబు, జగన్ లలో ఎవరు బెటర్ క్యాండిడేట్ అని చూసుకుంటే.. ‘నిజాయితీ, హుందాతనం, దానగుణం, జాతీయ భావాలు , అవినీతి ఆరోపణలు, ప్రసంగాల్లో మేధోతనం, స్వంత సామాజికవర్గం బలం, పూర్తికాలం’ వంటి అంశాల్లో ఈ ముగ్గురిలో ఎవరెవరికి ఎన్ని మార్కులు పడ్డాయన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..