Balakrishna-Vs-Ycp : బాలయ్య సినిమాల్లోనే కాదు.. బయట కూడా తొడగొడుతానని నిరూపించాడు. తన తండ్రి, తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి తొలగించడంపై కుక్కలు, దొంగలు అంటూ కాస్తా ఘాటుగానే స్పందించాడు. సినిమాలో హీరో కాబట్టి నడిచింది. బయట అలా నడవదు కదా.. అందుకే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. వరుసగా మంత్రులు లైన్లోకి వచ్చి బాలయ్యను సినిమాటిక్ వేలోనే తిట్టిపోశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో బాలయ్య ట్వీట్లపై దుమారం మొదలైంది. బాలయ్య వర్సెస్ మంత్రుల వార్ నడుస్తోంది. ఇప్పటికే జూ.ఎన్టీఆర్ బయటకొచ్చాడు.. మరి బాలయ్యకు మద్దతుగా ఎన్టీఆర్ కుటుంబం ఒక్కటవుతుందా? అన్నది వేచిచూడాలి.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ రాజకీయాల్లో రచ్చ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా ఫైర్ తగ్గడం లేదు. బాలయ్య తన ట్వీట్ తో ఇంకాస్త పెట్రోల్ పోసి మరీ అంటించాడు. దీంతో వైసీపీ మంత్రులు అంతేధీటుగా మాటల మంటలు రేపడంతో ఈ అగ్గి మరింతగా రాజుకుంది.
-ఇంతకీ బాలయ్య ఏమన్నాడు?
బాలయ్యబాబు సోషల్ మీడియాలో లేట్ గా స్పందించాడు. ఎన్టీఆర్ పేరు మార్పుపై బయట అంతా రచ్చ జరుగుతున్న వేళ లేట్ గా ఒక కార్టూన్ తో కాస్తా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. బాలయ్య పోస్ట్ చేస్తూ ‘మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు..ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు.. చభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త… అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..’’ అంటూ బాలయ్య బాబు సోషల్ మీడియాలో ఒక ఘాటు మెసేజ్ పోస్ట్ చేశాడు.
బాలయ్య ఈ మెసేజ్ ద్వారా అటు వైఎస్ఆర్ ను.. ఇటు జగన్ ను ఏకిపారేశాడు. తండ్రి వైఎస్ఆర్ గద్దెనెక్కాక ఎయిర్ పోర్టు పేరు మార్చాడని.. కొడుకు గద్దెనెక్కి ఏకంగా యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడని అన్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలు ఉన్నారని బాలయ్య స్పష్టమైన వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ దయతో ఎదిగిన వైసీపీ నేతలను విశ్వాసం లేని కుక్కలు అంటూ బాలయ్య పరుష పదజాలం వాడాడు. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అని అటు జగన్ ను .. ఇటు తెలుగుదేశం పార్టీలో ఎదిగిన వైసీపీ చేరిన వారిని బాలయ్య తూర్పార పట్టారు. ప్రస్తుతం బాలయ్య మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ అయినా లేటెస్ట్ గా బాలయ్య వేసిన పంచుల ప్రవాహం ఇప్పుడు జగన్ కు, వైసీపీకి కాస్త గట్టిగానే తగిలింది..
-భగ్గుమన్న వైసీపీ
ఎప్పుడూ నిదానంగా స్పందించే బాలయ్య బాబు ఫైర్ చూసి వైసీపీ బెంబేలెత్తింది. వెంటనే మంత్రులంతా కౌంటర్లతో రంగంలోకి దిగారు. సోషల్ మీడియా వేదికగానే కౌంటర్లతో విరుచుకుపడ్డారు. ఏఏ మంత్రులు ఏమన్నారో చూద్దాం..
————————–
-మంత్రి ఆర్కే రోజూ
‘బాలయ్యా.. ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు.. అక్కడ ఉంది రీల్ సింహం కాదు.. జ‘గన్’.. అనే రియల్ సింహం’ తేడా వస్తే దబిడి దిబిడే..’ అంటూ రోజా ఓ రేంజ్ లో ఆడిపోసుకుంది.
బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ"గన్" అనే రియల్ సింహం 🦁
తేడా వస్తే దబిడి దిబిడే..!!— Roja Selvamani (@RojaSelvamaniRK) September 24, 2022
-మంత్రి అంబటి రాంబాబు
అంబటి తనదైన స్టైల్లో పంచ్ వేశారు. ‘జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య’ అంటూ హీరో బాలయ్యను కాస్తా జోకర్ గా అభివర్ణించి ఎద్దేవా చేశాడు మంత్రి అంబటి రాంబాబు..
జోరు తగ్గించవయ్యా.. జోకర్ బాలయ్య ..!
— Ambati Rambabu (@AmbatiRambabu) September 24, 2022
-మంత్రి విడుదల రజినీ
‘బాలకృష్ణా… ప్రజల హెల్త్ అంటే మీకు ఎంత చులకన?!. 104, 108 వాహనాలను పాడు పెట్టి, ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరు ఉంచాలని ఉద్యమాలు చేస్తారా.?’ అంటూ మంత్రి విడుదల రజినీ కాస్తా ఘాటుగానే బదులిచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌ను, పిల్లల్ని ఎలుకలు కొరికే హాస్పిటల్స్, సెల్‌ఫోన్ లైట్లలో ఆపరేషన్లు చేసే హాస్పిటల్స్‌గా మార్చిన మీ ఎల్లో గ్యాంగ్… అయినా మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉండాలనుకుంటోంది!. ఇది కరెక్టేనా బాలకృష్ణా అంటూ నిలదీశారు.
బాలకృష్ణా…
ప్రజల హెల్త్ అంటే మీకు ఎంత చులకన?!. 104, 108 వాహనాలను పాడు పెట్టి, ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరు ఉంచాలని ఉద్యమాలు చేస్తారా.?— Rajini Vidadala (@VidadalaRajini) September 24, 2022
-*మంత్రి గుడివాడ అమర్ నాథ్
‘Both are not same… ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు వేయిస్తే.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు జగన్.. ’ అంటూ బాలయ్య ఫొటో పెట్టి మరీ గట్టి కౌంటర్ ఇచ్చాడు మంత్రి గుడివాడ అమర్ నాథ్
Both are not same…
ఎన్టీఆర్ మీద బాబు చెప్పులు వేయిస్తే
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి పూలు వేయించారు జగన్ pic.twitter.com/zAiGZdvH9G
— Gudivada Amarnath (@gudivadaamar) September 24, 2022
-మంత్రి మేరుగు నాగార్జున
‘మీరంతా కలిసి చంపేశాకే కదా.. చేసిన పాపం పేరు పెడితే పోతుందా? బాలకృష్ణా.. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారు? ఆయనను మీరంతా కలిసి చంపేశాకే కదా? చేసిన పాపం పేరు పెడితే పోతుందా? బాలకృష్ణా ’ అంటూ మంత్రి మేరుగు నాగార్జున పరుష పదజాలంతో బాలయ్యను కడిగిపారేశారు.
బాలకృష్ణా…
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు ఎప్పుడు పెట్టారు? ఆయనను మీరంతా కలిసి చంపేశాకే కదా? చేసిన పాపం పేరు పెడితే పోతుందా బాలకృష్ణా.?— Dr Merugu Nagarjuna (@merugunag) September 24, 2022
ఇక మంత్రి జోగి రమేశ్ డైరెక్టుగా ఎంట్రీ ఇచ్చి మరీ బాలయ్యను తిట్టాడు. ఎన్టీఆర్ పేరు తీసేసిన మూడురోజులకు బాలయ్య సృహలోకి వచ్చాడా? అని మండిపడ్డారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచెందెవరు? పార్టీని, ట్రస్ట్ ను లాక్కొని పీఠంపై చంద్రబాబు మీ బావ కూర్చోలేదా? అప్పుడు బాలయ్య ఏం చేశాడు? శునకం ఎవరు? ఆ శునకానికి తోక ఎవరు? అంటూ ఏకిపాడేశారు.
ఇలా వైసీపీ మంత్రులంతా ఎదురుదాడికి దిగడంతో బాలయ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఊహించని ఈ ఎదురుదాడిని ఎలా కాచుకుంటాడో చూడాలి. ఇప్పటికైతే బాలయ్యకు మద్దతుగా నందమూరి కుటుంబం స్పందించలేదు. వారు ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి. అంతా ఏకతాటిపైకి వచ్చి వైసీపీని ఎదుర్కొంటారో లేదో చూడాలి.