Annamalai Padayatra : రామేశ్వరం.. అతి పవిత్ర స్థలం.. శ్రీలంకకు వెళ్లడానికి శ్రీరాముడు రామసేతు నిర్మాణం ప్రారంభించిన భారతదేశపు చిట్టచివరి ప్రాంతం. కోట్లాది మంది హిందువులకు అత్యంత పవిత్ర స్థలం. నిన్న అక్కడ నుంచి అన్నామలై పాదయాత్ర మొదలుపెట్టాడు.
మొదటి రోజు అన్నామలైతో కలిసి నడవడానికి ‘లక్ష’ మంది పేర్లు నమోదు చేసుకున్నారు. దానికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీటింగ్ సభలో మాట్లాడారు. ఈ పాదయాత్రను ఆయనే ప్రారంభించాడు. అమిత్ షా మాట్లాడిన మాటలు తూటాల్లా పేలాయి.
ఇండియా కూటమి ఎజెండా ఏమిటి? సోనియా గాంధీ రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని.. ఉదయనిధిని స్టాలిన్ ను సీఎం చేయాలని.. లాలూ తేజస్విని సీఎం చేయాలని.. అభిషేక్ బెనర్జీని మమతా బెనర్జీ సీఎం చేయాలనే ఈ ‘ఇండియా కూటమి’ లక్ష్యం అని అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ కుమార్ ను ఎలా కేబినెట్ లో కొనసాగిస్తున్నారని అమిత్ షా ప్రశ్నించారు. ఇదే సీఎం స్టాలిన్ ఒకప్పుడు సెంథిల్ బాలాజీ అవినీతి పరుడు అని ఆరోపించారు. ఇప్పుడు ఆయనను బర్త్ రఫ్ చేస్తే స్టాలిన్ నే అడ్డుకుంటున్నాడు.
సింపథీ ఫ్యాక్టర్ మీద డిపెండ్ సెంథిల్ బాలాజీ అయ్యాడు. గుండెపోటు వచ్చిందని.. బైపాస్ సర్జరీ చేశారని అంటారు. ఈడీని ఆ ఆస్పత్రిలోకి అనుమతించలేదు. అన్నామలై వల్లే ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు రామేశ్వరంలో లక్ష మందితో మొదలైన అన్నామలై పాదయాత్ర చూసి డీఎంకే.. అన్నాడీఎంకే వణికిపోతున్నాయి.. అన్నామలై పాదయాత్ర ప్రభావంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.