Mystery Behind Lal Bahadur Shastri Demise : హోమీ బాబా, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలను మేమేం చంపామని అమెరికా గూఢచారి చెప్పడం సంచలనమైన సంగతి తెలిసిందే. ఈసారి లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక మిస్టరీ ఏంటన్న దానిపై తెలుసుకుందాం. ఎందుకు ఈ మిస్టరీని భారత ప్రభుత్వం ఛేధించుకోలేకపోయింది.

1945లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానం కూలిపోవడం నిజం కాదని.. ఆ మిస్టరీని ఇప్పటికీ ఛేదించలేకపోయారు. 1955లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆయన జమ్మూ కశ్మీర్ లో చనిపోయారు. 1965 లో హోమీ బాబా ఏకంగా బాంబు పేల్చాడు. లాల్ బహదూర్ శాస్త్రిది హత్య అని ఆరోపించారు.
లాల్ బహదూర్ శాస్త్రి మొట్టమొదటి సామాన్య మానవుడి గొంతుక. నెహ్రూ కంటే కూడా ఉదారవాది.. సామాన్య జనంలోంచి వచ్చిన నేత. అందుకే అంత పవర్ ఫుల్ గా ఎదిగాడు. అతి తక్కువ కాలంలో బాగా ప్రజాదరణ పొందిన ప్రజానేత. 1965లో పాకిస్తాన్ పై యుద్ధంలో భారత్ ను గెలిపించిన యోధుడు లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్.. జైకిసాన్.. అనే నినాదం బాగా పనిచేసింది.
పాక్ యుద్ధంపై లాహోర్ వరకూ వెళ్లమని నాడు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పినా నాటి మిలటరీ జనరల్ వినలేదన్నది వాదన.. అమెరికా, సోవియట్ యూనియన్లలో కలవకుండా మధ్యస్తంగా ఉన్నది భారత్. దీనికి లాల్ బహదూర్ శాస్త్రి చేశారు.
రాబర్ట్ క్రోలీ తన పుస్తకంలో ఏదైతే రివీల్ చేశారో.. లాల్ బహదూర్ శాస్త్రి మేమేం చేశామని అమెరికన్ గూఢచారి పేర్కొనడం సంచలనమైంది. లాల్ బహదూర్ శాస్త్రి బాడీకి పోస్టుమార్టం చేయకపోవడం.. ఆయన వ్యక్తిగత డాక్టర్ కుటుంబంతో సహా రోడ్డుప్రమాదంలో మరణించడం.. ఈయన వ్యక్తిగత సహాయకుడు మేజర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇవన్నీ అనుమానాలకు తావిచ్చింది.
ఈ క్రమంలోనే లాల్ బహదూర్ శాస్త్రిని న్యూక్లియర్ బాంబు తయారు చేయనివ్వకుండా చంపేశామని అమెరికన్ గూడచారి తెలిపారు. ఈ క్రమంలోనే ఇందులో నిజానిజాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.