Telangana Congress కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సంకట స్థితి ఎదురైంది. అటు కేసీఆర్ ను ఓడించాలా? ఇటు బీజేపీని ఓడించాలా? తెలంగాణలో ఎవరిని ఓడించాలన్నది కాంగ్రెస్ కు పెద్ద సమస్యగా మారింది. ఇది ముందు నుయ్యి వెనుకగొయ్యిలా మారింది. నిజానికి బీజేపీకి వ్యతిరేకంగా ఎవరొచ్చినా.. ఆఖరుకు దెయ్యంతోనైనా వాటేసుకునే అలవాటు కాంగ్రెస్ ది. ఇటీవల కాలంలో ఇదే ప్రూవ్ అయ్యింది.
శివసేనతో కాంగ్రెస్ కలుస్తుందని ఎవరైనా ఊహించారా? బీజేపీతో పోల్చుకున్నప్పుడు శివసేన ఇంకా గట్టి హిందుత్వ మూలాలున్న పార్టీ. అటువంటి శివసేనతో బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు జతకట్టారు. రెండో వైపు అస్సాంలో ఎవరూ ఊహించనివిధంగా ఏఐయూడీఎఫ్ తో కాంగ్రెస్ జతకట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఒకప్పుడు వ్యతిరేకించిన బీహార్ లో లాలూప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీతోనూ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది.
ఇవన్నీ కూడా బీజేపీని ఎలాగైనా సరే అధికారంలోకి రాకుండా చేసేందుకు ఈ ప్లాన్ చేసింది. బీజేపీ ఎటువంటి పరిస్థితుల్లో ఓడించాలని తమకు అనువుగానీ పార్టీతో పొత్తు పెట్టుకుంది.
తెలంగాణలో చూస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఓడించే పరిస్థితి ఉందా? అంటే ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. బీజేపీ పుంజుకోవడంతో ఇప్పుడు తెలంగాణలో కాషాయ పార్టీ బలంగా తయారైంది. కేసీఆర్ తో జత కట్టకుండా.. బీజేపీతో పొత్తు లేకుండా ఎలా ఈ రెండింటిని ఓడించాలన్నది కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు