Chandrababu Arrest : అవినీతి ఆరోపణలు వేరు, అనుసరించిన పద్ధతి వేరు

సీబీఐ ఇలానే పిలుస్తుంది. కానీ సీఐడీ పిలవలేదు. కావాలనే చేస్తోందన్న భావన వెళ్లింది. సీబీఐకి ఒక రూలు.. సీఐడీకి మరో రూలు లేదు.

Written By: NARESH, Updated On : September 11, 2023 4:23 pm

Chandrababu Arrest : చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అర్ధరాత్రి అరెస్ట్ చేసింది. దీని మీద రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. సహజంగానే ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో చంద్రబాబు పాత్ర ఉంది కాబట్టి అరెస్ట్ చేశామని చెబుతోంది. రెండో వైపు ‘అసలు కక్ష సాధింపు చర్యగా.. ఎలాగోలా జైల్లో పెట్టాలని చెప్పి చంద్రబాబును జైలుకు పంపారని’ ఆరోపిస్తున్నారు.చంద్రబాబును జైల్లో పెట్టడం మోడీ, అమిత్ షాలకు తెలిసే జరిగిందని.. వారిపై వ్యతిరేకతను కొందరు ఎగదోస్తున్నారు. అసలు ఏం జరిగిందన్నది తెలుసుకుందాం.

చంద్రబాబుపై పెట్టిన కేసు.. కేంద్ర ఐటీశాఖ పెట్టిన 118 కోట్ల కేసు కాదు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కేసునే. రాష్ట్ర సీఐడీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని.. ముడుపులు తీసుకున్నాడని సాక్ష్యాలు సేకరించి కేసులు పెట్టింది. ఈ కుంభకోణం మొత్తంలో చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధం ఉందనేది పాయింట్.

ముందుగా చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలి. రిప్లై ఇవ్వకపోతే మళ్లీ నోటీసులు ఇవ్వాలి. అదీ వినకపోతే కోర్టుకు వెళ్లాలి. కస్టడీలోకి తీసుకుంటామని కోరాలి. అన్ని విధాలా ప్రక్రియ పాటిస్తే జగన్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత రాదు. సీబీఐ ఇలానే పిలుస్తుంది. కానీ సీఐడీ పిలవలేదు. కావాలనే చేస్తోందన్న భావన వెళ్లింది. సీబీఐకి ఒక రూలు.. సీఐడీకి మరో రూలు లేదు.

అవినీతి ఆరోపణలు వేరు, అనుసరించిన పద్ధతి వేరు’ అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.