Urvasivo Rakshasivo Trailer: అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాకేష్ శశి తెరకెక్కించారు. నవంబర్ 4న ఉర్వశివో రాక్షసివో మూవీ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఉర్వశివో రాక్షసివో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. లవ్, రొమాన్స్, కామెడీ కలగలిపి యూత్ ఫుల్ అంశాలతో మూవీ తెరకెక్కినట్లు అర్థం అవుతుంది. అడల్ట్ జోక్స్ డోసు కూడా కొంచెం ఎక్కువగానే ఉంది.

ఈ రోజుల్లో లైసెన్సు ఎవరు అడుగుతున్నారు హెల్మెట్ ఉంటే సరిపోతుందని అల్లు శిరీష్ అడల్ట్ జోక్ పేల్చాడు.అల్లు శిరీష్-అను ఇమ్మానియేల్ కెమిస్ట్రీ అదిరిందని చెప్పాలి. అల్లు శిరీష్ ప్రజెన్స్, అను ఇమ్మానియేల్ గ్లామర్, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హైలెట్ కానున్నాయి. మొత్తంగా ఉర్వశివో రాక్షసివో ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. యూత్ ని ఆకట్టుకునే అంశాలతో చక్కగా సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఊర్వశివో రాక్షసివో చిత్రానికి అచ్చు సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో విడుదల అవుతుంది. సునీల్ కీలక రోల్ చేశారు. నిన్న నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా నటసింహం బాలయ్య హాజరయ్యారు. ఆయన చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఉర్వశివో రాక్షసివో మూవీ ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నుండి మూవీ వస్తుంది. 2019లో ఏబీసీడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఒక సాలిడ్ కమర్షియల్ హిట్ కోసం ఆయన చాలా ట్రై చేస్తున్నారు. అల్లు శిరీష్ కోరిక ఊర్వశివో రాక్షసివో మూవీ నెరవేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. అల్లు శిరీష్ సైతం మూవీ విజయం పై విశ్వాసంతో ఉన్నారు. మరి చూడాలి ఉర్వశివో రాక్షసివో అల్లు శిరీష్ కి ఎలాంటి ఫలితం ఇస్తుందో.