Chor Bazaar Trailer Talk : డ్యాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. రవితేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీలో నిలబెట్టిన మన పూరి తన సొంత కుమారుడు ‘ఆకాశ్’ను మాత్రం ఇండస్ట్రీలో నిలబెట్టలేకపోతున్నారు. ఇదివరకే ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్న పూరి ఇప్పుడు ఇతర దర్శక నిర్మాతలతో కలిసి మంచి కథా బలం ఉన్న స్టోరీ దొరికితే సినిమాలు తీయిస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘ఆకాశ్ పూరి’ హీరోగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ముూవీ ‘చోర్ బజార్’ ఈ మూవీ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ప్రముఖ స్టార్ హీరో బాలకృష్ణ ఈ ట్రైలర్ ను లాంచ్ చేశారు. చోర్ బజార్ లో కార్లు రిపేర్ చేసే మాస్ యువకుడి పాత్రలో ఆకాశ్ పూరి నటించగా.. హీరోయిన్ మూగ అమ్మాయిగా కనిపించింది. వీరిద్దరి ప్రేమ పట్టాలెక్కేలోపు ఓ ఖరీదైన వజ్రం మాయంకావడం.. అది మన హీరోకు చుట్టుకోవడం.. ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? వజ్రం కథ ఏంటన్నది ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.
ఈ సినిమాలో సునీల్ కలక పాత్రలో కనిపించాడు. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వీఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ట్రైలర్ చూస్తుంటే పూర్తిగా పూరి జగన్నాథ్ స్టైల్ లో అతడి హీరో మాస్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలోని బజార్ నేపథ్యంలో కథ రాసుకున్నట్టు తెలుస్తోంది.
‘బచ్చన్ సాబ్’ అంటూ మాస్ లుక్ లో ఆకాశ్ పూరి పవర్ ఫుల్ గా కనిపించాడు. ఆకాశ్ ను ప్రేమించే మూగ అమ్మాయి పాత్రలో హీరోయిన్ గెహన సిప్పీ నటించింది. సీనియర్ నటి అర్చన, సునీల్, సంపూర్ణేశ్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీహెచ్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
ఈ ట్రైలర్ ను కింద చూడొచ్చు.