కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వాహనదారులు ఆన్ లైన్ లోనే ఆర్‌టీవో సేవలు పొందే అవకాశాన్ని కల్పించింది. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన విధానం ద్వారా ఆన్ లైన్ లోనే డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, ఇతర సర్వీసులను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం కాంటాక్ట్ లెస్ సర్వీసులను ఆధార్ అథెంటికేషన్ ద్వారా అందజేస్తోంది.
Also Read: నెలకు రూ.3,300 కడితే అదిరిపోయే బైక్ మీ సొంతం.. ఎలా అంటే..?
వాహనదారులు ఇకపై ఆన్ లైన్ లోనే 18 రకాల సేవలను పొందవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ నుంచి నిన్న ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్‌టీవో సేవలను సరళతరం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో లైసెన్స్, రిజిస్ట్రేషన్ తో పాటు రెన్యువల్ వంటి సేవలను కూడా సులభంగా పొందవచ్చు.
Also Read: రెడ్ మీ 10 ఫోన్స్ లాంచ్.. అద్భుత ఫీచర్లు.. వివరాలివే..!
లైసెన్స్ చిరునామాలో మార్పు చేసుకోవడంతో పాటు లెర్నర్స్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, మోటార్ వెహికిల్ తాత్కాలిక రిజిస్ట్రేషన్, ఇతర సేవలను ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు. కేంద్రం ఆన్ లైన్ ద్వారా ఆర్‌టీవో సేవలను అందించే దిశగా అడుగులు వేయడంపై వాహనదారుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ప్రయోజనం చేకూరే దిశగా అడుగులు వేయడం గమనార్హం.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో రద్దీని తగ్గించే దిశగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆర్‌టీవో కార్యాలయాల్లో రద్దీ తగ్గుతుందని చెప్పవచ్చు.