https://oktelugu.com/

Rahul Gandhi : యూపీలో కాంగ్రెస్ పోటీ చేసే 17 స్థానాల్లో, 2019లో 12 చోట్ల డిపాజిట్లు గల్లంతు

యూపీలో కాంగ్రెస్ పోటీ చేసే 17 స్థానాల్లో, 2019లో 12 చోట్ల డిపాజిట్లు గల్లంతు.. యూపీ ఎంపీ ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2024 5:29 pm

    రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్నాడు. మధ్యలో బ్రేక్ తీసుకున్నాడు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగానికి పిలిచారు. దేశంలో పరిస్థితులు వదిలేసి విదేశాలకు వెళ్లాడు. నిన్న యూపీలో రెండు కీలకమైన పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. 17 సీట్లు కాంగ్రెస్ కు ఇవ్వబోతున్నట్టు సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. పరువు పోకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ కూడా సరేనని ఒప్పుకుంది.

    ప్రియాంక గాంధీ బతిమిలాడి ఒకటి రెండు నియోజకవర్గాలను దక్కించుకుందని సమాచారం. ఇక ఈ చర్యతో యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఓటమిని ఒప్పుకుందని అర్థమవుతోంది. ఎటూ ఓడిపోయే సీట్లు అని వాటినే కాంగ్రెస్ కు సమాజ్ వాదీ పార్టీ ఇచ్చిందని సమాచారం.

    మొత్తం 80 యూపీ ఎంపీ సీట్లలో 17 కాంగ్రెస్ కు, చంద్రశేఖర్ భీం పార్టీకి 1, మిగతా 62 సీట్లు సమాజ్ వాదీకి కేటాయించుకున్నారు. కాంగ్రెస్ కు ఇచ్చిన 17 ఎంపీ సీట్లలో 12 సీట్లలో 2019లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. పోయిన సారి యూపీలో 63 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఘజియాబాద్ లో మెజార్టీ శాతం రాగా, అమ్రోహలలో 1 శాతం వచ్చింది.. రాయ్ బరేలిలో మాత్రమే సోనియాగాంధీ గెలిచింది. డిపాజిట్ కోల్పోకుండా దక్కించుకున్నవి అమేథి, కాన్పూర్, సహరన్ పూర్ లలో డిపాజిట్లు దక్కించుకుంది.

    యూపీలో కాంగ్రెస్ పోటీ చేసే 17 స్థానాల్లో, 2019లో 12 చోట్ల డిపాజిట్లు గల్లంతు.. యూపీ ఎంపీ ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    యూపీలో కాంగ్రెస్ పోటీ చేసే 17 స్థానాల్లో, 2019లో 12 చోట్ల డిపాజిట్లు గల్లంతు || Rahul Gandhi