ఇప్పుడు ఎందరో వెళ్లే ఆ విజయవాడ కనక దుర్గమ్మ గుడి అప్పుడు ఎలా ఉందో గుర్తు పట్టారా?
ప్రకాశం బ్యారేజ్ ను చూశారా? కానీ ఇది ఇప్పటిది కాదండోయ్ అప్పుడు నిర్మాణం లో ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఫోటో.
వైజాగ్ బీచ్ రోడ్ ను గుర్తు పట్టారా? ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఉంది కదా.
ఆంధ్ర ప్రదేశ్ లోని మొదటి థియేటర్ ఇది. అదేనండి మారుతీ టాకీస్ 1921 లో ప్రారంభం అయింది.
విజయవాడ రైల్వే స్టేషన్ కు కచ్చితంగా మీరు వెళ్లే ఉంటారు. ఇది అదేనండోయ్.
విజయవాడ కృష్ణా నది పుష్కరాలు వస్తే ఇసుక వేస్తే రాలనంత జనాలు వెళ్తారు. ఇదిగో అప్పుడు ఇదే విధంగా ఉండేవి ఆ పుష్కరాలు.
ఎన్నో హంగు ఆర్భాటాలతో నిండిన ఇప్పటి ట్రైన్ లను చూశాకా అప్పటి ట్రైన్ చూస్తే ఇది ట్రైనా అనిపిస్తుందా? కానీ నిజంగా అది ట్రైన్ అండి. పాసెంజర్ ట్రైన్.
వైజాగ్ తీర ప్రాంతం లోని నివాసాలు ఏ విధంగా ఉన్నాయో గుర్తు పట్టారా?