Prabhas & Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్పను ప్రభాస్ కాపాడుతాడా..? అసలు ఆ సినిమా మ్యాటరేంటి..?
ప్రస్తుతం తనదైన రీతిలో సత్తాను చాటుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్న యంగ్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. అయితే మంచు విష్ణు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన ఆయనకు సక్సెస్ అయితే దక్కడం లేదు. కారణం ఏదైనా కూడా ఆయన సినిమా సెలక్షన్ లోనే చాలా వరకు తప్పు చేస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి...
Written By:
Gopi, Updated On : October 29, 2024 12:22 pm
Follow us on
Prabhas & Manchu Vishnu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు…ఈయన చాలా సినిమాలు చేసినప్పటికి స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. ఇక వరుస సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నప్పటికి తను స్టార్ హీరో అవ్వడంలో మాత్రం ఫెయిల్ అయిపోయాడు. ఇక మోహన్ బాబు నట వారుసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు కూడా దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఒక్క భారీ సక్సెస్ ని కూడా అందుకోలేకపోయాడు. కారణం ఏదైనా కూడా తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడంలో ఆయన చాలా వరకు వెనుకబడ్డాడనే చెప్పాలి. మరి ఈ క్రమంలో ఆయన చేస్తున్న సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజానికి భక్తకన్నప్ప సినిమాతో తను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమా మీద మొదట్లో మంచి అంచనాలు ఉన్నప్పటికి సినిమా నుంచి టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సినిమా మీద ఉన్న అంచనాలన్ని తగ్గిపోయాయనే చెప్పాలి. సగటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా మీద ఆసక్తి చూపించడం లేదు. ఇక ప్రభాస్ ఈ సినిమాలో నంది క్యారెక్టర్ లో నటించినప్పటికి సినిమా మీద సాఫ్ట్ కార్నర్ అయితే రాలేకపోతుంది.
ఇక ప్రభాస్ ను మినహాయిస్తే మిగిలిన సినిమా ఏది కూడా అంత పెద్దగా మ్యాజిక్ చేయబోదనే విషయాన్ని కూడా ప్రేక్షకులు ముందే గమనిస్తున్నారు. కాబట్టి కన్నప్ప సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావాలంటే ప్రభాస్ ఏదైనా మ్యాజిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక అందులో భాగంగానే కన్నప్ప సినిమాలో ప్రభాస్ ను ఇన్వాల్వ్ చేయాలని విష్ణు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఉన్నా కూడా భక్తకన్నప్ప సినిమా మీద అంత పెద్ద భారీ బజ్ అయితే రాకపోవడానికి కారణం మంచు విష్ణు అనే చెప్పాలి. ఆయన తక్కువ బడ్జెట్ లో సినిమాను చేస్తూ 150 కోట్ల సినిమాను చేస్తున్నాం అని చెప్పడం మీద సోషల్ మీడియా లో పలు రకాల కామెంట్లైతే వస్తున్నాయి. మరి ప్రభాస్ వల్లే ఈ సినిమా అంతో ఇంతో సక్సెస్ సాధిస్తుందని పలువురు వాళ్ళ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటాలంటే మాత్రం ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో మంచు విష్ణు భారీ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది…