Ustad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ మీద అంచనాలు తగ్గిపోతున్నాయా..? కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కి ఎప్పుడు మంచి గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చింది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ సాధించడమే కాకుండా పవన్ కళ్యాణ్ కు 10 సంవత్సరాల తర్వాత సూపర్ సక్సెస్ ని అందించిన సినిమాగా కూడా ఇది మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది...

Written By: Gopi, Updated On : October 29, 2024 2:46 pm

Are the expectations on Ustad Bhagat Singh decreasing..? What is the reason..

Follow us on

Ustad Bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొంతమేరకు షూటింగ్ జరుపుకుంది. అయితే ఈ సినిమా మీద అప్పట్లో భారీ బజ్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఈ సినిమా మీద ఎలాంటి బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు. నిజానికి హరీష్ శంకర్ ఈ మధ్యకాలంలో రవితేజని హీరోగా పెట్టుకొని చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను కూడా హరీష్ శంకర్ లైట్ తీసుకున్నాడు అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే  రవితేజ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలపలేని హరీష్ శంకర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాను మాత్రం సక్సెస్ చేస్తాడా? లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హరీష్ శంకర్ తన ఎంటైర్ కెరియర్ లో మిరపకాయ్, గబ్బర్ సింగ్ లాంటి భారీ సక్సెస్ లను అందుకున్నప్పటికి ఉస్తాద్ భగత్ సింగ్ తో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా హరీష్ శంకర్ లాంటి దర్శకుడు కమర్షియల్ సినిమాలను చేయడంలో సిద్ధహస్తుడు. అయినప్పటికీ ఆయన ఒకప్పటిలా మ్యాజిక్ అయితే చేయలేకపోతున్నాడు.
కారణం ఏంటంటే ప్రస్తుతం ఆయన రోటీన్ రొట్ట ఫార్ములా కథలను ఎంచుకుంటూ దానికి అనుగుణమైన స్క్రీన్ ప్లే ని రాసుకోవడంలో ఆయన చాలా వరకు ఫెయిల్ అవుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉంటున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ అనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చింది.
కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి సినిమానే రాబోతుంది అనే అభిప్రాయలైతే వెలువడుతున్నాయి. కానీ మొత్తానికైతే హరీష్ శంకర్ ఇంతకు ముందు తను చేస్తున్న సినిమాలతో అందుకోవడం వల్ల  వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే వీళ్ళ కాంబినేషన్ కి ఇంతకుముందు ఉన్నట్టుగా ఇప్పుడు భారీ బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు.
మరి ఒక్కసారి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తే సినిమా మీద బజ్ అయితే క్రియేట్ అవుతుంది అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం హరీష్ శంకర్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో హరీష్ శంకర్ అంత మంచి ఫామ్ లో లేడు. కాబట్టి ఈ సినిమాని ఎలా చేస్తున్నాడు అనే అనుమానాలను కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు…