Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Wife Sneha Reddy : అల్లు అర్జున్ భార్య ఇలా షాకిచ్చిందేంటి? షాకింగ్...

Allu Arjun Wife Sneha Reddy : అల్లు అర్జున్ భార్య ఇలా షాకిచ్చిందేంటి? షాకింగ్ పిక్స్ వైరల్

Allu Arjun Wife Sneha Reddy : ఒకప్పుడు హీరోల భార్యల గురించి ప్రపంచానికి తెలిసేది కాదు. వాళ్ళు పబ్లిక్ లోకి రావడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. ట్రెండ్ మారింది. స్టార్స్ సతీమణులు వారి కంటూ సపరేట్ ఇమేజ్, ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నారు. అలాగే స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపిస్తూ గ్లామరస్ అవతార్ లో మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ విషయంలో అల్లు స్నేహారెడ్డి చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఫిట్నెస్ ఫ్రీక్. బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. నిజానికి స్నేహారెడ్డికి వివాహమైంది అంటే నమ్మడం కష్టమే. ఇంకా టీనేజ్ గర్ల్ లా ఆమె కనిపిస్తున్నారు.

దీని వెనుక ఆమె కష్టం చాలా ఉంది. స్నేహారెడ్డి ఫిట్నెస్, బ్యూటీ విషయంలో చాలా క్రమశిక్షణగా ఉంటుంది. వ్యాయామం, యోగా ఆమె దినచర్యలో భాగం. స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటుంది.

గార్డెన్ లో మొక్కలతో గడపడం ద్వారా ఆమె మానసిక ప్రశాంత పొందుతారట. తరచుగా స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తారు. తాజాగా ట్రెండీ వేర్లో సూపర్ స్టైలిష్ గా ఆమె దర్శనం ఇచ్చారు. ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక స్నేహారెడ్డి-అల్లు అర్జున్ లది ప్రేమ వివాహం. ఓ వేడుకలో కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసిన వీరిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. అల్లు అర్జున్ తో పెళ్ళికి స్నేహారెడ్డి ఫాదర్ చంద్రశేఖర్ రెడ్డి మొదట్లో ఒప్పుకోలేదట.

స్నేహారెడ్డి పట్టుబట్టి అల్లు అర్జున్ ని భర్తగా తెచ్చుకుందట. 2011 లో అల్లు అర్జున్-స్నేహారెడ్డిల వివాహం ఘనంగా జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు అయాన్ కాగా, అమ్మాయి పేరు అర్హ. అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం మూవీలో నటించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular