Zip Coding Relationship: ప్రస్తుతం మనం అత్యంత ఆధునిక సాంకేతిక యుగంలో జీవిస్తున్నాం. ప్రతీది కూడా కళ్ళ ముందు.. కాళ్ళ ముందు ఉండేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. సప్త సముద్రాల అవతల ఉన్న వ్యక్తితో కూడా సులువుగా లైవ్ లో మాట్లాడేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే తాగే నీటి నుంచి మొదలు పెడితే తినే తిండి వరకు ప్రతిదీ సులువుగానే తెప్పించుకుంటున్నాం. చివరికి బ్యాంకింగ్ సేవలు కూడా ఆన్లైన్లోనే చేసే స్థాయికి ఎదిగాం.
కేవలం సేవల విషయంలోనే కాదు.. ఇంకా చాలా వాటిలో అప్డేట్ అయ్యాం. మనుషుల వ్యక్తిగత జీవితంలో ప్రముఖమైన ప్రేమ విషయంలో కూడా టెక్నాలజీ అనుగుణంగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటి కాలంలో ప్రేమికులు ఎంత దూరంలో ఉన్నా సరే లాంగ్ డిస్టెన్స్ లో సంభాషించుకుంటున్నారు. అయితే ఇంతటితోనే ఆగడం లేదు. ప్రేమ కోసం కాలు కూడా కదపకుండా ఆన్లైన్ లోనే అన్ని కానిస్తున్నారు.
నచ్చిన అమ్మాయిని లేదా అబ్బాయిని ప్రేమలో పడేయాలంటే గతంలో యువత అనేక ప్రయాసపడేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆన్లైన్లోనే మనకు నచ్చిన వారిని సౌలభ్యం వచ్చేసింది. దీనినే జిప్ కోడింగ్ అని పిలుస్తున్నారు.
టెక్నాలజీ పరిభాషలో ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి జిప్ లేదా పిన్ కోడ్ వాడుతుంటారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధమైన జిప్ కోడ్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఇదే విధానాన్ని డేటింగ్ యాప్ లలో కూడా కొనసాగిస్తున్నాయి. కొన్ని డేటింగ్ యాప్స్ ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. డేటింగ్ యాప్ లో సైన్ అప్ చేస్తున్నప్పుడు లొకేషన్ ఎన్ని కిలోమీటర్ల పరిధిలో మ్యాచ్ లు అందుబాటులో ఉన్నాయి లేదా ఎన్ని మ్యాచ్ లు కావాలి అనే విషయంపై ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. ఈ ప్రశ్నల ప్రకారం ఒక వ్యక్తి తనకు దగ్గర్లో ఉన్న వారు మాత్రమే కావాలని కోరుకుంటాడు. దీనినే జిప్ కోడింగ్ అని చెబుతుంటారు.
ఈ తరంలో చాలామంది ప్రేమ కోసం డేటింగ్ యాప్స్ ను ఉపయోగించిన పరిపాటిగా మారింది. పైగా తనకు సరిపోయే మ్యాచ్ ను చూసుకోవడం.. ఇష్టాలు తెలుసుకోవడం.. అభిరుచులను అంచనా వేయడం.. వారి రూపాన్ని చూసి ఎంపిక చేసుకోవడం పెరిగిపోయింది. అలాంటప్పుడు నచ్చిన వ్యక్తి ఒకవేళ దూరంగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు. వారిని కలుసుకోవడానికి అనేక రకాల ప్రయాసలు పడాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వారిని కలుసుకోవడానికి ఎక్కువ సమయాన్ని తెచ్చించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒత్తిడికి గురి చేస్తున్న నేపథ్యంలో ఈ తరం యువత తమకు దగ్గరలో వ్యక్తులను ఎంపిక చేసుకుంటున్నది.