What Is After Death: తల్లి గర్భం నుంచి పుట్టిన తర్వాత.. శిశువు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అదే ఒక మనిషి వృద్ధాప్యం తర్వాత చనిపోతే.. ఏం జరుగుతుంది.. ఇంతవరకు సినిమాలలో.. కల్పానిక సాహిత్యాలలో రకరకాల విషయాలు చెప్పినప్పటికీ.. అవి ఎంతవరకు నిజం అనేది ఇంతవరకు శాస్త్రీయంగా నిరూపణ జరగలేదు. అయితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది ఇంతవరకు తెలియ రాలేదు. అయితే దీనిపై కొంతకాలంగా శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే చావుకు దగ్గరగా వెళ్లి.. ఆ సమయంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనే విషయాలు తెలుసుకోవడం కష్టమని ఇప్పటికే శాస్త్రవేత్తలు వెల్లడించారు. శ్వేత దేశంలోని కొలరాడో ప్రాంతంలో 33 సంవత్సరాల బ్రయానా లాఫర్జీ అనే మహిళ ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. చనిపోయిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరుగుతాయి స్వయంగా చూసి చెప్పింది. బ్రయానా లాఫర్జీ ఇటీవల క్లినికల్ మరణాన్ని చవిచూసింది. ఆ వ్యవధి ఎనిమిది నిమిషాల పాటు ఉంది. ఆ తర్వాత తన అనుభవాలను ఆమె వెల్లడించింది. చావు అనేది భౌతికంగా జరిగే ఒక క్రియ మాత్రమే నట.. ఆత్మకు అసలు చావు అనేది ఉండదని బ్రయానా లాఫర్జీ వెల్లడించింది.
బ్రయానా లాఫర్జీ ఆమె మైక్లోనస్ డైస్టోనియా అనే ప్రాణాంతకమైన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల 8 నిమిషాల పాటు క్లినికల్ మరణాన్ని ఆమె పొందింది. ఈ మరణం పొందిన తర్వాత ఎటువంటి పరిణామాలను.. విషయాలను ఆమె చూసిందో బయటికి వెల్లడించింది..” నేను కన్ను మూసిన తర్వాత మొత్తం చీకటిగా దర్శనమిచ్చింది. కొంత సమయం తర్వాత నేను ఇంకో లోకంలోకి వెళ్ళిపోయాను. అనంతరం నేను వైద్య పరంగా చనిపోయినట్టు వైద్యులు వెల్లడించినట్టు నాకు అర్థమవుతుంది. అయితే నేను మాత్రం స్పృహలోకి వచ్చినట్టు అనిపించింది. భౌతికంగా నా శరీరం నుంచి వేరు చేసిన భావన కలిగింది. అప్పటికే నేను బతికే ఉన్నానని అనుభూతి నాకు దక్కింది. కన్నుమూసేటప్పుడు నాకు ఎటువంటి నొప్పి కలగలేదు. బాధ అనేది కలగలేదు. అయితే మనశ్శాంతి మంత్రం మెండుగ దక్కిందని” బ్రయానా లాఫర్జీ వెల్లడించింది.
” శరీరం నుంచి వేరుపడిన తర్వాత నా ఆత్మ దేహం నుంచి అలా ఎగురుకుంటూ వెళ్లిపోయింది. అక్కడ మనుషులు లేరు. కాకపోతే వేరే రకమైన జీవులు ఉన్నాయి. అక్కడ సమయం ఎలా ఉంటుందో తెలియదు గానీ.. ప్రతీది సందర్భం ప్రకారం జరుగుతోంది. మనుషులుగా మనం కేవలం తాత్కాలికం మాత్రమే.. మరణం తర్వాత మనిషి ఆలోచన సరళి పూర్తిగా మారిపోతుందని” బ్రయానా లాఫర్జీ వెల్లడించింది. బ్రయానా లాఫర్జీ మనలోకానికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడింది. అనేక సమస్యలను ఆమె ఎదుర్కొన్నది. నడవడం లో తడబడింది. మాట్లాడే విషయంలో కాస్త కష్టాన్ని ఎదుర్కొంది. పిట్యూటరీ గ్రంధిలో కూడా సమస్యను చవిచూసింది. చివరికి ఆమె మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది..