Vistadome coaches: దేశంలో చాలామంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో సురక్షితంగా ప్రయాణించవచ్చని రైలు ప్రయాణానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దగ్గర అయిన, దూరం అయిన సమయం ఉంటే మొదటి ప్రాధాన్యత రైలు ప్రయాణానికే ఇస్తారు. అయితే దేశంలో ఎన్నో రకాలు రైళ్లు ఉన్నాయి. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఎవరి బడ్జెట్‌కు తగ్గట్లుగా రైలు ప్రయాణాల్లో సౌకర్యాలు ఉంటాయి. కనీసం నెలకి ఒకసారైన ప్రతి ఒక్కరూ ఏదో పని మీద బయటకు వెళ్తుంటారు. ఈరోజుల్లో చాలామంది తరచుగా బయట ట్రిప్‌లకు వెళ్తుంటారు. దీంతో టైన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే బస్సు అయితే లేటు అవుతుంది. పోని ఫ్లైట్‌కి అయితే తొందరగా వెళ్లవచ్చు. కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చులో అన్ని చుట్టేసి రావాలని ఎక్కువ శాతం మంది రైలు ప్రయాణం చేయడానికే ఇష్టపడుతుంటారు. అయితే రైళ్లలో కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అని ఇలా ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో రైళ్లలో విస్టాడోమ్ కోచ్‌ను కొత్తగా తీసుకొచ్చారు. ఈ కోచ్‌లో ప్రయాణిస్తే ఎన్నో సౌకర్యాలు ఉండటంతో పాటు ప్రకృతి అందాలను కూడా చూడవచ్చు. మరి ఈ విస్టాడోమ్ కోచ్ ప్రత్యేకతలు ఏంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
రైళ్లలో విస్టాడమ్ కోచ్ అంటే అద్దాలతో ఉంటుంది. ఈ కోచ్ లోపల అన్ని సౌకర్యాలు ఉంటాయి. రైళ్లలో ఏసీ కోచ్‌లో ఉండే సౌకర్యాలు కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ విస్టాడమ్ కోచ్‌ను దేశంలో మొదటిసారిగా ఏపీలో ప్రవేశపెట్టారు. 2017లో విశాఖపట్నం-అరకు రూట్‌లో కిరండూల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తీసుకొచ్చారు. ఈ అద్దాల బోగీలో కూర్చోని ప్రయాణిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మొదటి ఈ లైన్ తీసుకొచ్చిన తర్వాత మరికొన్ని లైన్లలో కూడా తీసుకొచ్చారు. సాధారణంగా అరకు అందాలు చూడటానికి ఎంతో బాగుంటాయి. అలాంటిది ఈ విస్టాడోమ్ కోచ్‌లో ప్రయాణిస్తే.. ఆ ఫీలింగ్ చెప్పలేరు. పచ్చని కొండ, మంచు, జలపాతాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. అయితే ఈ విస్టాడమ్ కోచ్‌ను గ్లాస్‌తో సీలింగ్ చేస్తారు. అద్దాలతో కోచ్ ఉండటం వల్ల జర్నీ చేసిన ఫీలింగ్ ఉండదు. బయట అందాలు అన్నింటిని చూడవచ్చు. ఈ కోచ్‌లో సీట్లు విశాలంగా ఉంటాయి. మొత్తం 360 డిగ్రీలో ఉంటాయి. అంటే మీ సౌకర్యాన్ని బట్టి సీటును తిప్పుకోవచ్చు. ఈ కోచ్‌లో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ ఉండటంతో పాటు వైఫే సదుపాయం కూడా ఉంటుంది.
ఈ విస్టాడమ్ కోచ్‌లో ప్రయాణించడం వల్ల ఎలాంటి అలసట అనిపించదు. ఎందుకంటే చక్కటి ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ ప్రయాణిస్తారు. వీటిలో జర్నీ చేస్తే ఆ ఫీలింగ్ కూడా బాగుంటుంది. అయితే ఈ విస్టాడమ్ కోచ్ అనేది ప్రతీ రైలుకు ఉండదు. కేవలం కొన్ని రైళ్లకు మాత్రమే ఉంటుంది. ప్రత్యేకమైన రైళ్లకు మాత్రమే వీటి సౌకర్యం ఉంటుంది. అయితే మన దేశంలో కొన్ని ప్రయాణాల కోసం ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన లైన్లలో మాత్రమే ఈ విస్టాడమ్ కోచ్‌ను ఏర్పాటు చేశారు. మరి మీరు ఎప్పుడైనా ఈ కోచ్‌లో ప్రయాణించారా? ప్రయాణిస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.