Tesla Car Viral Video: ఎలన్ మస్క్.. ఈ పేరు ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అపర కుబేరుడిగా వెలుగొందుతున్నాడు. ప్రపంచంలోనే అగర్బ శ్రీమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. కార్ల నుంచి మొదలు పెడితే అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకెళ్లే రాకెట్ల వరకు అన్ని వ్యాపారాలనూ మస్క్ నిర్వహిస్తున్నాడు.. ఇటీవలే శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారం లోకి కూడా ప్రవేశించాడు.
మస్క్ ఎన్ని వ్యాపారాలు చేసినప్పటికీ.. అతడు రూపొందించిన ఎలక్ట్రానిక్ వెహికల్ టెస్లా అన్నిటికంటే ప్రత్యేకం. ఎందుకంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో(భారత్ మినహా) టెస్లా కారులు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వెహికల్ గా పేరుపొందిన టెస్లా అమెరికాలో తన సత్తా చూపిస్తోంది.. ఇక ఇటీవల టెస్లాలో కార్లలో మస్క్ అనేక మార్పులు తీసుకొచ్చాడు. అత్యంత పటిష్టమైన లోహంతో టెస్లాకార్లను తయారు చేయడం మొదలుపెట్టాడు. అవి ప్రకృతి విపత్తుల నుంచి మొదలుపెడితే రోడ్డు ప్రమాదాల వరకు తట్టుకుంటాయని మస్క్ నిరూపించాడు. అయితే టెస్లా కారు ప్రయోజనాల గురించి, అందులో ఉన్న సౌకర్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌకర్యాలు, ప్రయోజనాలకు తగ్గట్టుగానే ఆ కారు ధర కూడా ఉంటుంది.
టెస్లా కార్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. కొంతమంది ఔత్సాహికులు టెస్లా కార్ల మీద విభిన్నమైన వీడియోలను రూపొందిస్తున్నారు. అయితే ఆ వీడియోలో టెస్లా కార్లను ఉపయోగించి చేస్తున్న పనులు చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు.. టెస్లా కారును ఉపయోగించి ఓ రైతు పొలాన్ని దున్నుతున్నాడు. మరో మహిళా రైతు టెస్లా కార్ ద్వారా విత్తనాలు వేస్తోంది. ఇంకో రైతు టెస్లా కారును ఉపయోగించి పొలానికి పురుగుల మందు స్ప్రే చేస్తున్నాడు. వాస్తవానికి టెస్లా కారు తో ఈ పనులు చేయడానికి అవకాశం లేకపోయినప్పటికీ.. వారంతా ఈ పనులు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అయితే టెస్లా కారు ద్వారా వారు చేసే పనులు మొత్తం నిజమైనవి కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఆ వీడియోను రూపొందించారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో పడి వైరల్ అయింది. ఇప్పటికే లక్షలలో వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిని చూసిన నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కూడా వీడియోలు రూపొందిస్తారా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు..” టెస్లా కారు చాలా విలువైనది. అమెరికా మార్కెట్లో దానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అలాంటిది వీరు ఈ పనులు చేస్తున్నారు. వారు చేస్తున్న పనులు చూస్తే మస్క్ షాక్ కు గురవుతాడు. అంతేకాదు తను తయారుచేసిన టెస్లా కారును ఇలా కూడా వాడతారా అంటూ దిగ్భ్రాంతికి గురవుతాడు. ఎందుకైనా మంచిది ఈ వీడియో మస్క్ కంటపడకుండా ఉండాలి” అని నెటిజన్లు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.