Snake Revenge Truth: పామును చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే పాములో ఉండే విషం తో మనిషిని కాటేస్తే చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా మిగతా కీటకాల కంటే భయంకరమైన ఆకారంతో ఉండడంతో ఎక్కడ పాము కనిపించినా వణుకు పుడుతుంది. అయితే కొందరు పాములు చూడగానే భయపడి పోతే.. మరికొందరు మాత్రం దానిని చంపే వరకు విడిచిపెట్టరు.. అయితే పామును చంపడం వల్ల పగబడతాయని కొందరు చెబుతూ ఉంటారు. పామును కొట్టడం వల్ల అది జీవితాంతం మనిషిని వెంటాడి చంపుతుందని కొందరు పేర్కొంటారు. అసలు నిజంగానే పాములు పగబడతాయా? దీనిపై సైంటిస్టులు ఏం చెప్పారు?
మిగతా జీవులాగే పాములు కూడా ఒక జాతికి చెందినవి. ఏ జీవి అయితే ఆహారం కోసం పోరాడుతుందో.. పాములు కూడా రక్షణ కోసం నిత్యం పూసలు కొడుతూ ఉంటుంది. అంతేకానీ ఎవరిని కావాలని కాటేయడానికి ముందుకు రాదు. అంతేకాకుండా పాముకు వినికిడి శక్తి తక్కువగా ఉంటుంది. ఇవి నేలపై ఉండే కంపనాల ద్వారా మాత్రమే ముందుకు కదులుతాయి. కొంతమంది పాములు సంగీతానికి నృత్యాలు చేస్తాయని అంటుంటారు. కానీ పాముకు వినికిడి శక్తి తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. అంతేకాకుండా పాములకు జ్ఞాపకశక్తి కూడా తక్కువగా ఉంటుందని.. ఒక్కోసారి ఒక పుట్టలో నుంచి వచ్చిన పాము మళ్లీ అదే పుట్టలోకి వెళ్లకపోతే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాములు ఎవరిని గుర్తు పెట్టుకునే అవకాశం లేదని.. అంతేకాకుండా ఎవరిని పగ పట్టవు అని చెబుతున్నారు.
భారతదేశంలో నాగుపాము, రక్తపింజరి, కట్లపాము, త్రాచు పాములు విషపూరితమైనవి. పాము కాటు వేయగానే వెంటనే ఆందోళన చెందకుండా ప్రాథమికంగా చికిత్స చేసి.. ఆ తర్వాత సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అన్ని పాములు విషపూరితమైనవి కావు. కొన్ని పాములు కాటు వేసిన విషం ఎక్కదు. ఎందుకంటే ఒక పాము ఆహారం తీసుకున్న నాలుగు గంటల తర్వాత మాత్రమే విషయాన్ని తయారు చేసుకుంటుంది. ఏ పాము అయినా ఆహారం కోసం మాత్రమే ప్రయాణం చేస్తుంది. ఈ క్రమంలో నేలపై అలికిడితోనే ఒక్కోసారి ఎదుటి వారిని గుర్తించి ఆత్మరక్షణ కోసం పోరాడుతుంది.
Also Read: Snake Village : మన దేశంలో ఉన్న ఈ పాముల గ్రామం గురించి మీకు తెలుసా?
దేశంలో పాములు అంతరించిపోతున్నాయని జంతు ప్రేమికులు అంటున్నారు. భూమ్మీద ఉన్నా అరుదైన జాతుల్లో పాములు ఒకటని వారు పేర్కొంటున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా పాములను వెంటాడుతూ ఉంటారు. పాము చర్మంను వివిధ అవసరాలకు ఉపయోగిస్తారు. కొన్ని జాతుల వారు ప్రత్యేకంగా పాములను వెంటాడుతూ ఉంటారు. ఒక ప్రాంతంలో ఏదైనా ప్రమాదం ఉందంటే ఆ పాము మరో పాముకు తెలియజేస్తుంది. ఇలా తెలియజేసే క్రమంలో పిరోమోన్లను రిలీజ్ చేస్తుంది. దీని ద్వారా మరో పాము అక్కడ ప్రమాదం ఉందని గుర్తించి కాపాడుకుంటుంది. ఇలా పాముల మధ్య కమ్యూనికేషన్స్ ఉంటాయి. పాములు ప్రత్యేకంగా ఎవరిని గుర్తు పెట్టుకోవు. అయితే వాటికి ఉండే కళ్ళ ద్వారా నేలపై ఉండే కీటకాలను గుర్తించి ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. పాము నాలుగే రెండు గా చీలి ఉంటుంది. దీని ద్వారా అనే ఆహారాన్ని తీసుకుంటుంది.