Homeవింతలు-విశేషాలుSeven Colors in Each Feather : ఒక్కో ఈకలో సప్తవర్ణాలకు మించిన రంగులు.. ఈ...

Seven Colors in Each Feather : ఒక్కో ఈకలో సప్తవర్ణాలకు మించిన రంగులు.. ఈ బాతులను చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే?

Seven Colors in Each Feather : బాతుల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. అయితే ఆసియా ప్రాంతంలో కనిపించే బాతులలో అనేక రకాలుంటాయి. ఇందులో కొన్ని బాతులు ఎక్కువగా నీటిలో జీవించి.. తమ సంతాన ఉత్పత్తిని పెంచుకోవడానికి మాత్రమే ఒడ్డు ప్రాంతానికి వస్తుంటాయి. ఇంకా కొన్ని బాతులు భూమ్మీద ఎక్కువగా ఆహార సేకరణ చేసి.. అప్పుడప్పుడు నీటిలో ఈదుతుంటాయి. బాతులు శాఖాహార, మాంసాహార జీవులు. ఇవి చిన్న చిన్న పురుగులను తింటుంటాయి. బాతులను అన్నదాతల మిత్ర జంతువులుగా పేర్కొంటారు. భారతదేశంలో భూలోక స్వర్గంగా పేరుపొందిన కేరళ రాష్ట్రంలో రైతులు వరి సాగు చేయడానికి అంటే ముందు తమ పొలాలలో బాతులను అటు ఇటు తిప్పుతుంటారు. దీనివల్ల పొలాలలో ఉన్న పురుగులు చనిపోతాయి. పురుగుల లార్వాలు నాశనం అవుతాయి. కీటకాలను బాతులు తినడం ద్వారా పంట పొలాలకు ఎటువంటి వ్యాధులు వ్యాపించవు. చీడ పీడలు సోకవు. తద్వారా పంట ఉత్పత్తి కూడా బాగుంటుంది. కేరళ మాత్రమే కాకుండా ఈశాన్య రాష్ట్రాలలో కూడా రైతులు ఇదేవిధంగా చేస్తారు. అందువల్లే ఆ ప్రాంతాలలో పండే ధాన్యం అత్యంత నాణ్యంగా ఉంటుంది.

ముందుగానే చెప్పినట్టు బాతులు తెలుపు లేదా నలుపు వర్ణంలో ఉంటాయి. అరుదైన సందర్భంలో తెలుపు నలుపు వర్ణాలలో కనిపిస్తుంటాయి. అయితే మాండరిన్ బాతులు మాత్రం అనేక రంగులలో దర్శనమిస్తుంటాయి. వీటి ఈకల్లో సప్తవరణాలు కనిపిస్తుంటాయి. ఇక మగబాతులయితే అత్యంత అందంగా ఉంటాయి.. వీటిని ప్రపంచంలోనే అత్యంత క్యూటెస్ట్ డక్స్ అని పిలుస్తుంటారు.. ఈ బాతులు ఎక్కువగా తూర్పు ఆసియా ప్రాంతాలలో కనిపిస్తుంటాయి. ఇవి నీటిలో ఎక్కువసేపు ఉండవు. నీటిలో ఈదే సమయంలో తమ భాగస్వామితోనే ఉంటాయి. భాగస్వామితో కలిసి ఆహార అన్వేషణ చేస్తాయి. ఇవి ఎక్కువగా పండ్లను ఆహారంగా తీసుకుంటాయి. పండ్లు లభించని పక్షంలో కీటకాలను.. చిన్నచిన్న పురుగులను తింటాయి. ఇవి నత్తలను తింటాయి.

మాండరిన్ బాతుల రూపం కూడా విచిత్రంగా ఉంటుంది. వీటి గొంతు కోయిల మాదిరిగానే ఉంటుంది. శ్రావ్యంగా పలుకుతుంటాయి. నీరు తాగుతున్నప్పుడు.. ఆహారాన్ని తింటున్నప్పుడు ఇవి ప్రత్యేకమైన శబ్దాలు చేస్తుంటాయి. దట్టమైన అడవులలో జీవించే ఈ బాతులు.. నీటి వనరుల వద్ద విస్తృతంగా కనిపిస్తుంటాయి. అయితే పెరిగిన కాలుష్యం.. పర్యావరణ అసమతౌల్యం వల్ల వీటి సంతతి తగ్గిందని తెలుస్తోంది.. అయితే మిగతా బాతులు లాగా ఇవి ఒంటరి జీవితాన్ని కాకుండా.. కేవలం భాగస్వామితో మాత్రమే ఎందుకు ఉంటాయి? వీటి ఈకలకు ఆ స్థాయిలో రంగులు ఎందుకు వస్తుంటాయి? వీటి గొంతు అంతా శ్రావ్యంగా ఎందుకు ఉంటుంది? అనే అంశాలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. పైగా ఈ బాతుల గుడ్ల పరిమాణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఇవి కూడా రైతు సహకారులుగా పేరుపొందాయి. కాకపోతే దట్టమైన అటవీ ప్రాంతాలలో వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. ఇవి ఆహార అన్వేషణలో భాగంగా వలస వెళ్లినప్పుడు.. సమీప పంట పొలాలలో విసర్జకాలను వదులుతుంటాయి. అవి కలుపు నివారణ ఔషధాలుగా వీటి విసర్జకాలు పనిచేస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular