Min Hengkai as a Monk: ఆ సినిమాలో ఏదో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆ విధంగా పాట రాశారు. కానీ నిజ జీవితంలో ఇలా జరుగుతుందా… అలా ఎవరికైనా అవుతుందా.. వివాహం అంతటి ఇబ్బందిని ఎందుకు తీసుకొస్తుంది.. అనే ప్రశ్నలు మీకు వ్యక్తమవుతున్నాయి.. మీకే కాదు.. ఇతడికి కూడా అలాంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎదురు కావడం కాదు.. ఆ బాధలను ఇతడు అనుభవించాడు. తట్టుకోలేక వివాహం వద్దు.. వైరాగ్యం ముద్దు.. అంటూ నిరాశాజనకమైన జీవితాన్ని జీవించలేక.. గుహలోకి వెళ్లిపోయాడు. అక్కడ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.. ఇంతకీ ఇతడు ఎవరు.. ఇతడి నేపథ్యం ఏమిటంటే..
చైనాలో మిన్ హెంకాయ్ అనే 35 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. ఇతడికి ప్రతి నెల లక్ష వేతనం వచ్చే ఉద్యోగం ఉంది. అయినప్పటికీ ఆ ఉద్యోగాన్ని అతడు వదిలేశాడు.. నాలుగు సంవత్సరాలుగా నగరానికి దూరంగా గుహలో జీవిస్తున్నాడు. అయితే తన బంధువులు తన ఆస్తులు అమ్ముకున్నారు. ఇతడి ప్రమేయం లేకుండానే ఆ పని చేశారు. అయినప్పటికీ అతడు వారిని ఏమీ అనలేదు. అయితే గతంలో అతడు అప్పులు చేశాడు. వాటిల్లో కొన్నింటిని తీర్చేశాడు. ఇంకా 42 వేల డాలర్ల అప్పులు అతనికి ఉన్నాయి.. అయితే 35 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇతడు వివాహం చేసుకోలేదు. దానికి కారణమేమిటో తెలియదు. ఆ విషయాన్ని అతడు బయట పెట్టలేదు. కాకపోతే అతడు పెళ్లి చేసుకోలేదు. బంధువులకు దూరంగా వెళ్లిపోయాడు. ఎక్కడో గుహలో జీవిస్తున్నాడు. కాకపోతే అక్కడ స్మార్ట్ ఫోన్ వాడుతున్నాడు. ఇతడికి సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది. దానిని లైవ్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఇతడికి ఆదాయం లభిస్తోంది. ఇతడిని సోషల్ మీడియాలో 42,000 మంది దాకా అనుసరిస్తున్నారు. అయితే గతంలో ఇతడికి ఒక ప్రేమ వ్యవహారం ఉండేదని తెలుస్తోంది. ఆమెతో ఇతడి వ్యవహారం మొదట్లో బాగానే ఉండేది. ఆ తర్వాత ఆమె తన అసలు రూపాన్ని ఇతడికి చూపించింది. దీంతో మోసపోయానని గ్రహించిన అతడు వెంటనే నిరాశలో కూరుకుపోయాడు. ఇక బంధువులు కూడా ఇతడిని ఆర్థికంగా వాడుకున్నారు. తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అటు ప్రేమికురాలు.. ఇటు బంధువులు ఇబ్బంది పెట్టడంతో అతడు అన్నింటిని వదిలేసి దూరంగా వెళ్లిపోయాడు. నాగరిక జీవనానికి దూరంగా.. ప్రకృతికి అత్యంత దగ్గరగా జీవిస్తున్నాడు.
Also Read: Inspirational story : జీవితాన్ని మార్చేసే గాడిద కథ. చదివిన తర్వాత కచ్చితంగా మారుతారు
” కొన్ని సందర్భాలలో మనం అన్ని సొంతం అనుకుంటాం. అన్ని మనవే అని భావిస్తుంటాం. వాటికోసం మన ప్రాణాలను కూడా ఇస్తుంటాం. అలాంటి ఆలోచన తప్పు. ఎందుకంటే ఈ సృష్టిలో నిజమైన ప్రేమ అనేది ఉండదు. ప్రతి ప్రేమ వెనుక స్వార్థం ఉంది. సొంత అవసరం ఉంది. అవసరం, స్వార్థం ఎప్పుడూ ప్రేమకు ప్రతిరూపాలు కాదు. అందువల్లే అటువంటి స్వార్థపూరితమైన ప్రపంచానికి.. అవసరాలతో నిండిన వ్యక్తులకు దూరంగా వెళ్లిపోయాను. ఇప్పుడు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాను. నచ్చిన తిండి తింటున్నాను. ఇష్టం వచ్చిన చోటికి వెళుతున్నాను. నన్ను ఎవరు ప్రశ్నించలేరు. నన్ను ఎవరు వారించలేరు. జీవితాన్ని ఒక సార్ధక దిశగా తీసుకెళ్తున్నానని” అతడు చెబుతున్నాడు. ఇదే విషయాలను అతడు తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నాడు. అతడు చెబుతున్న మాటలు చాలామందికి నచ్చడంతో.. అదేపనిగా వింటున్నారు. అయితే అందరి జీవితంలో ఇలా ఎందుకుంటుందని.. నీ జీవితంలో జరిగినంత మాత్రాన మిగతావారు విషయంలో కూడా ఇలానే జరుగుతుందని ఎలా అనుకుంటావని.. కొంతమంది నెటిజన్లు అతడిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.