https://oktelugu.com/

Key Board: కీబోర్డ్‌లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో ఎందుకు కీస్ ఉండవు.. దీనికి గల కారణమేంటి?

కీబోర్డులోని కీలు ఎందుకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో ఉండవని ఎప్పుడైనా ఆలోచించారా. అన్ని విషయాలు గమినించే వారికి ఈ డౌట్ ఎప్పుడో వచ్చే ఉంటుంది. అయితే కీబోర్డులోని కీలు ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో ఎందుకు ఉండవు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.

Written By: , Updated On : December 9, 2024 / 02:18 AM IST
key board

key board

Follow us on

Key Board: ఈ రోజుల్లో చాలా మంది కంప్యూటర్లు వాడుతున్నారు. నిజం చెప్పాలంటే ఇవి లేకపోతే అసలు సగం పని కూడా కాదు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లతోనే వర్క్ చేస్తున్నారు. అంతా డిజిటల్ మీడియా అయిపోవడంతో కంప్యూటర్లు లేకపోతే అసలు ఏ పని కూడా జరగదు. అన్ని రంగాల్లో కూడా కంప్యూటర్ అనేది తప్పకుండా అవసరం. అయితే కంప్యూటర్ వాడాలంటే కీబోర్డు కూడా తప్పనిసరి. కీబోర్డు లేకుండా కంప్యూటర్ వాడటం అసాధ్యం. అయితే రోజూ కీబోర్డు వాడుతున్న.. అందులో కొన్ని విషయాలను అసలు గమనించం. సాధారణంగా ఏబీసీడీలు వరుస క్రమంలో ఉంటాయి. కానీ కీబోర్డులో మాత్రం ఇవి అసలు వరుస క్రమంలో ఉండవు. అసలు కీబోర్డులోని కీలు ఎందుకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో ఉండవని ఎప్పుడైనా ఆలోచించారా. అన్ని విషయాలు గమినించే వారికి ఈ డౌట్ ఎప్పుడో వచ్చే ఉంటుంది. అయితే కీబోర్డులోని కీలు ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో ఎందుకు ఉండవు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.

కీబోర్డులో పైన అనగా మొదటి వరుసలో కొన్ని లెటర్స్ ఉంటాయి. ఫస్ట్ లైన్‌లో Q, W, E, R, T, Y, U, I, O, P అనే అక్షరాలు ఉంటాయి. అయితే ఈ కీబోర్డును అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి తయారు చేశాడు. అది కూడా ఎప్పుడంటే 1868లో ఈ కీబోర్డును తయారు చేశారు. ఆల్ఫాబెటిక్‌లో లెటర్స్ వరుసగా ఉన్న కీబోర్డు వాడటం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేదట. అందుకే ఈ తరహా కీబోర్డును తీసుకొచ్చారట. అయితే ఇంగ్లీష్ లెటర్స్‌లో అన్నింటిని కూడా సమానంగా ఉపయోగించం. కొన్ని తక్కువగా ఉపయోగిస్తే.. మరికొన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఈ క్రమంలో మనం వాడే లెటర్స్‌ను బట్టి కీబోర్డును తయారు చేశారట. ఉదాహరణకు A,E,I,O,U, P, B, L, M, N, K, L అక్షరాలను ఎక్కువగా వాడుతుంటారు.

అదే Q, Z W, X వంటి లెటర్స్ అయితే చాలా తక్కువగా వాడుతుంటారు. అయితే ఎక్కువగా వాడే లెటర్స్‌పై ఒత్తిడి పడకుండా ఈజీగా ఉపయోగించాలని వేళ్లు పడే విధంగా సెట్ చేశారు. లెటర్స్ ఉండే ప్లేస్ బట్టి అవి చేతికి ఈజీగా ఉండటంతో తొందరగా వర్క్ చేయగలరనే కారణంతోనే కీబోర్డును ఈ విధానంగా క్రిస్టోఫర్ తయారు చేశాడు. ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో కీబోర్డులో కీలు ఉంటే సరిగ్గా, తొందరగా వర్క్ చేయలేరట. ఇలా అయితే ఈజీగా ఉంటుందని తయారు చేశారట. సాధారణంగా కీబోర్డులో కింద ఉన్న కంటే పైన ఉన్న అక్షరాలనే చాలా తక్కువగా వాడుతుంటారట. అందుకే మొబైల్ కీబోర్డు కూడా ఇదే మోడల్‌లో ఉంటుంది. ఈ మోడల్‌లో ఉండటం వల్ల ఫాస్ట్‌గా కీబోర్డుపై టైప్ కూడా చేయగలరట. లైన్ వైజ్ ఉండటం కంటే ఇలా ఉంటేనే ఈజీగా ఉంటుందట. అందుకే కీబోర్డులోని కీలు ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో ఉండవు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.