Finland deer safety : ఆహార అన్వేషణలో రోడ్లను దాటే క్రమంలో జింకలు అత్యంత వేగంగా పరుగులు తీస్తుంటాయి. అదే సమయంలో ఆ రోడ్ల మీదుగా ఏవైనా వాహనాలు వెళ్తున్నప్పుడు.. జింకలను ఢీకొంటాయి. ఆ ప్రమాదంలో అప్పుడప్పుడు జింకలు చనిపోతుంటాయి. అనేక సందర్భాలలో గాయపడుతుంటాయి.. అయితే ఇటీవల కాలంలో జింకలు చనిపోతున్న సంఘటనలు.. జింకలు గాయపడుతున్న పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వీటికి చెక్ పెట్టడానికి ఫిన్లాండ్ ప్రభుత్వం ఒక బృహత్తరమైన ఆలోచనను తెరపైకి తీసుకువచ్చింది. జింకల ప్రాణాలను కాపాడేందుకు ఏకంగా సాహసానికి నడుం బిగించింది.. దీంతో జింకల ప్రాణాలు నిలబడుతున్నాయి. అంతేకాదు అవి రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా చేస్తున్నాయి. ఇంతకీ అక్కడి అధికారులు ఏం చేశారంటే..
Also Read : పూర్వీకుల జ్ఞానాన్ని భద్రంగా ఉంచింది.. మనకు అందించింది ఈ చెట్టు పత్రాలే!
యూరప్ ఖండంలో ప్రధాన దేశమైన ఫిన్లాండ్లో రెయిన్ డీర్స్ ఉంటాయి. వీటికి పొడవైన కొమ్ములుంటాయి. అవన్నీ కూడా దృఢంగా ఉంటాయి. మెలికలు తిరిగి అందంగా కనిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో జింకలు రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్న నేపథ్యంలో ఫిన్లాండ్ అధికారులు ఒక వినూత్నమైన ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు.. జింకల కొమ్ములకు రిఫ్లెక్టివ్ పెయింట్ పూశారు. దీనివల్ల జింకల కొమ్ములు మెరవడం మొదలైంది. వాహనాల లైట్స్ కు రిఫ్లెక్టివ్ పెయింట్ పూస్తుంటారు. అవి చీకట్లో మెరుస్తుంటాయి. దీనివల్ల ఎదురుగా వచ్చే వాహనదారులు అప్రమత్తమవుతుంటారు.. ఇక ఇదే సిద్ధాంతాన్ని ఫిన్లాండ్ అధికారులు జింకలకు అమలు చేయడం మొదలుపెట్టారు. వాటి కొమ్ములకు రిఫ్లెక్టివ్ పెయింట్ పూశారు. దీంతో జింకల కొమ్ములు మెరవడం మొదలైంది. ఫలితంగా వాహనదారులు ఆ జింకలను చూసి నెమ్మదిగా పోవడం ప్రారంభమైంది. దీంతో ఆ జింకల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా ఉంటున్నాయి..” ఇటీవల కాలంలో జింకల మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలలో అవి చనిపోవడం బాధ కలిగిస్తోంది. అందువల్ల వాటిని కాపాడేందుకు ఈ ప్రయత్నం చేసాం. ఇది మంచి ఫలితాన్ని ఇస్తోంది. మేం చేసిన ప్రయోగం వల్ల జింకలు బతికి బట్ట కడుతున్నాయి. ఆ జింకలను చూస్తున్నప్పుడు ఆనందం కలుగుతోందని” ఫిన్లాండ్ అధికారులు చెబుతున్నారు.
ఫిన్లాండ్ దేశంలో అధికంగా జింకలు ఉంటాయి. ఇక్కడ అడవుల్లో అవి విస్తారంగా కనిపిస్తుంటాయి.. ఫిన్లాండ్ దేశంలో అడవుల మీదుగా రహదారులు ఉంటాయి. ఆహార అన్వేషణలో భాగంగా జింకలు రోడ్లను దాటుతున్న సమయంలో అనుకోకుండా ప్రమాదాల బారిన పడుతున్నాయి. దీనివల్ల ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఈ పరిణామానికి చెక్ పెట్టేందుకు ఫిన్లాండ్ అధికారులు ఈ తీరుగా ప్రయోగం చేశారు. అది విజయవంతం కావడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో ఉన్న జింకలకు మొత్తం అధికారులు ఆ పెయింట్ పూస్తున్నారు. ప్రమాదాల బారిన పడకుండా చూస్తున్నారు.