Homeవింతలు-విశేషాలుSummer Travel Places In India: ఎండాకాలంలో చిల్ అవ్వండి..విదేశాలలో కాదు భయ్యా.. మన ఇండియాలోనే.....

Summer Travel Places In India: ఎండాకాలంలో చిల్ అవ్వండి..విదేశాలలో కాదు భయ్యా.. మన ఇండియాలోనే.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం

Summer Travel Places In India: ఎండాకాలంలో ఎవరికైనా చిరాకు పుడుతుంది. నెత్తి పైన సూరీడు కుంపటి లాగా భగభగమంటుంటాడు. చెమట, ఉక్కపోత, ఫ్యాన్ ఉపశమనం ఇవ్వదు. కూలర్ చల్లదనం సరిపోదు. ఏసీ వేద్దామంటే కరెంట్ బిల్లు గుర్తుకు వచ్చి గుండె ఆగిపోతుంది. ఎండాకాలంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రాంతాల్లో తిరిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీరం చల్లగా ఉంటుంది. హాయి కలిగి ఆనందంగా ఉంటుంది.

ఎండాకాలంలో చిల్ అవడానికి చాలామంది కూల్ ప్రదేశాలను ఎంచుకుంటారు. పైగా సమ్మర్ లో పిల్లలకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉంటాయి కాబట్టి ఏంచక్కాతిరిగి రావొచ్చు. నేటికాలంలో రైళ్లు, విమానాలు, బస్సు టికెట్లను ఆన్ లైన్ లోనే నమోదు చేసుకునే అవకాశం ఉంది. సమ్మర్ లో మనదేశంలో చల్లగా చిల్ అయ్యే ప్రాంతాలు చాలా ఉన్నాయి. అవి ఏంటి? ఎలా వెళ్లాలి? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వేసవిలో కేరళ రాష్ట్రంలో విహరిస్తే ఆ హాయే వేరు. ఎండాకాలాన్ని మననంలో పెట్టుకుని IRCTC అద్భుతమైన ప్యాకేజీలను తీసుకొచ్చింది. కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరుతో ప్రత్యేకమైన విహార యాత్ర ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ లో ఏకంగా విభిన్నమైన ప్రాంతాలను చూడొచ్చు. ఆరు రోజులపాటు ఈ టూర్ సాగుతుంది. మున్నార్, అలెప్పీ వంటి ప్రాంతాలను ఈ టూర్ లో భాగంగా చూడొచ్చు.

దక్షిణమధ్య రైల్వే కు కీలక కేంద్రమైన సికింద్రాబాద్ నుంచి ఈ టూర్ మొదలవుతుంది. సికింద్రాబాద్, నల్లగొండ, గుంటూరు, తెనాలి స్టేషన్ లలో బోర్డింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రయాణం ముగిసిన తర్వాత ఇదే స్టాపులలో దిగొచ్చు. సికింద్రాబాద్ లో జర్నీ మధ్యాహ్నం 2:25 నిమిషాలకు శబరి ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11 గంటల30 నిమిషాలకు ఆలువా స్టేషన్ లో రైలు ఆగుతుంది.

ఆలువా నుంచి మున్నార్ కు రైలు వెళ్తుంది. అక్కడ సహజసిద్ధప్రాంతాలను సందర్శించవచ్చు. రాత్రి మున్నార్ లో ఉండవచ్చు. తర్వాతి రోజు ఎరవికులం జాతీయ పార్కు ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ టీ మ్యూజియం ఉంటుంది. మెట్టుపట్టి డ్యామ్ ఏకో పాయింట్ ను కూడా చూడొచ్చు. ఆ రోజు రాత్రి మున్నార్ లోనే బస చేయాలి. తర్వాతి రోజు అలెప్పీ వెళ్లాలి. అక్కడ వివిధప్రాంతాలను చూసిన తర్వాత ఎర్నాకుళం వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉదయం 11 గంటల 15 నిమిషాలకు శబరి ఎక్స్ ప్రెస్ సిద్ధం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

టూర్ ప్యాకేజీలకు సికింద్రాబాద్ లోని దక్షిణమధ్యరైల్వే కార్యాలయాన్ని సందర్శించాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular