Sperm Donor: వీర్యం అంటేనే మగవాడి వీరత్వం. ఎందుకంటే దాని ద్వారానే అతడు తండ్రి అవుతాడు.. ఒక మహిళను తల్లిని చేస్తాడు. సమాజ ఉద్ధరణకు తన వంతుగా పాటుపడుతుంటాడు. వాస్తవానికి వీర్యం అనేది అనేక రకాల జన్యువుల కలయిక. అది అండంతో కలిసినప్పుడు.. అనేక రకాల ప్రక్రియలు జరుగుతాయి. ఆ తర్వాత పిండం ఏర్పడుతుంది. అనేక దశలను దాటుకొని ఒక ప్రాణాన్ని పుట్టే విధంగా చేస్తుంది.
ఇటీవల కాలంలో తమ భర్తల ద్వారా చాలామంది మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారు. ఇటువంటి వారి కోసం వీర్య బ్యాంకులు పుట్టుకొచ్చాయి. ఈ బ్యాంకులు పనిచేయాలంటే కచ్చితంగా దాతల ద్వారా వీర్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. అలా సేకరించిన వీర్యాన్ని మహిళల లో ఐవీఎఫ్ విధానంలో ప్రవేశపెడతారు. తద్వారా వారికి మాతృత్వాన్ని ప్రసాదిస్తారు.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వీర్యం బ్యాంకులు కొనసాగాలంటే కచ్చితంగా దాతలు ఉండాలి. దాతల ద్వారా సేకరించిన వీర్యాన్ని వీర్యం బ్యాంకులు అనేక రకాల విధానాలలో భద్రపరిచి.. ఆ తర్వాత మహిళలలో ప్రవేశపెడుతుంటారు.. అయితే చాలామంది తమలో ఉన్న వీర్యాన్ని స్వయం విధానాల ద్వారా బయటికి పంపించి తృప్తి పొందుతుంటారు. అయితే ఇటీవల కాలంలో వీర్యం బ్యాంకులు పుట్టుకు రావడంతో చాలామంది తమ వీర్యాన్ని దానం చేస్తున్నారు. అయితే అందరూ వీర్యం దానం చేయడం సాధ్యం కాదు. అందరి వీర్యం బ్యాంకులలో భద్రపరచడానికి సాధ్యం కాదు.
వీర్యాన్ని దానం చేసే ప్రక్రియకు ప్రతి వంద మందిలో అయిదుగురు మాత్రమే దానికి అర్హులవుతారు. ఒక మనిషి జీవితంలో నిర్దేశిత సంఖ్యలో వీర్యకణాలు ఉండాలి. వాటికి సామర్థ్యం ఉండాలి. కదలికలు, ఆకృతి కూడా మెరుగ్గా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఘనీభవన ప్రక్రియను తట్టుకునే సామర్థ్యం కచ్చితంగా ఉండాలి. వీర్యాన్ని దానం చేసేవారిలో హెచ్ఐవి, గనేరియాబంటి వ్యాధులు అసలు ఉండకూడదు. సిస్టిక్ ఫైబ్రోసిస్, స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ, సికెల్ సెల్ ఎనీమియా వంటి వ్యాధులను కలిగించే రుగ్మతలు ఉండే జన్యువు ఉత్పరివర్తనాలు అత్యంత ప్రమాదకరం.
అందువల్లే వీర్యదానానికి కొంతమందిని మాత్రమే బ్యాంకులో ఎంచుకుంటాయి. ఉదాహరణకు బ్రిటన్ దేశంలో ఉపయోగిస్తున్న వీర్యంలో చాలావరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నది కావడం విశేషం. కచ్చితత్వం కోసం బ్యాంకులు వీర్య దానానికి ముందుకు వచ్చిన వారి వివరాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తాయి. దాతలను అనేక రకాలుగా ప్రశ్నలు వేస్తాయి. వారి ఆరోగ్య నేపథ్యం.. కుటుంబ నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలిస్తాయి. ఒకవేళ అనువంశిక రుగ్మతలు గనుక ఉండి ఉంటే.. భవిష్యత్తు కాలంలో వచ్చే ప్రమాదం ఉండి ఉంటే మొహమాటం లేకుండా వీర్యాన్ని సేకరించడానికి ఒప్పుకోవు. అందువల్లే మగవాడి వీరత్వానికి వీర్యం ప్రతీక కావచ్చు. కానీ అందరివీర్యం దానానికి పనికిరాదు.