White House: భారత దేశంలో గ్రాడ్యుయేషన్ వరకు చదివి.. ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్తున్న భారతీయులు అక్కడే స్థిరపడుతున్నారు. అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదిగారు. రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక అమెరికాలో స్థిరపడిన భారతీయుల పిల్లలు కూడా తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా అత్యంత ప్రతిభావంతులుగా గుర్తింపు పొందిన భారతీయ అమెరికన్లు పద్మిని పిళ్లై, నళిని టాటా ప్రతిష్టాత్మకమైన వైట్‌హౌస్ ఫెలోషిప్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. ‘వైట్‌హౌస్ ఫెలోస్క్రింగ్రాం’ కోసం ఈ ఏడాది అమెరికా నలుమూలల నుంచి 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో భారతీయ మూలాలు ఉన్న పద్మిని పిళ్లై, నళిని టాటా ఉన్నారు.
పద్మిని పిళ్లై గురించి..
బోస్టన్‌కు చెందిన ఇమ్యూనో ఇంజినీర్ పద్మిని పిళ్లై సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేస్తుంది. పద్మిని 2013లో అనారోగ్యానికి గురైంది. మరణం అంచువరకు వెళ్లింది. ఆస్పత్రుల్లో రోజుల తరబడి గడిపింది. కోలుకున్న తర్వాత చిన్న పనిచేసినా అలసిపోయేది. పూర్తిగా కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. రెగిస్ కాలేజీ నుంచి బయోకెమస్ట్రీలో డిగ్రీ, యేల్ యూనివర్సిటీలో ఇమ్యూనో బయాలజీలో పీహెచ్‌డీ చేసిన పద్మిని పిల్లై కోవిడ్ విధ్వంసంపై లోతైన విశ్లేషణ చేసింది. వ్యాక్సినేషన్, ఇమ్యూనిటీ, వైరస్ ప్రభావంపై ఆమో ఆలోచనలను సీఎన్‌బీసీ, ది అట్లాంటిక్,న్యూయార్క్ టైమ్స్‌లాంటి మీడియా సంస్థలు కవర్‌చేశాయి.
నళిని టాటా గురించి…
న్యూయార్క్‌కు చెందిన నళిని టాటా వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్‌య క్యాబినెట్ అఫైర్స్‌లో పిచేస్తుంది.
నళిని టాటా బ్రౌన్ యూనివర్సిటీలో న్యూరోబయోలజీలో బీఎస్సీ, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జిలో ఎంఫిల్, నార్త్ వెస్ట్రన్ ఫీన్ బర్గ్ స్కూల ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ చేసింది. హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో డెమోక్రసీ, పాలిటిక్స్ అండ్ ఇనిస్టిట్యూషన్‌లో పట్టా పొందారు. ఎన్నో సైంటిఫిక్ జర్నల్స్‌లో పరిశోధనాత్మక రచనలు చేసింది. వైద్య విషయాలపైనే కాదు ఆర్థిక, రాజకీయ అంశాలపైకూడా నళిని టాటాకు ఆసక్తి ఉంది.
ఫెలోషిప్‌కు ఎంపికైతే..
వైట్‌హౌస్ ఫెలోషిప్‌కు ఎంపికైతే క్యాబినెట్ కార్యదర్శులు, ఉన్నతస్థాయి పరిపాలన అధికారులతో సహా వైట్‌హౌస్ సీనియర్ సభ్యుల మార్గదర్శకత్వంలో ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ కాలం పనిచేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటురంగాలకు చెందిన నాయకులతో రౌండ్‌టేబుట్ చర్చలలో పాల్గొంటారు. తగిన ప్రతిభ చూపితే ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.
కఠినంగా ఫెలోషిప్ ప్రోగ్రాం..
వైట్‌హౌస్ ఫెలోస్ ప్రోగ్రాంను 1964లో ప్రారంభించారు. అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాములలో ఇది ఒకటి. తాము ఎంచుకున్న రంగంలో సాధించిన విజయాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ,మొదలైనవి ఎంపిక ప్రక్రియలో ప్రధానాంశాలు. ఇదిలా ఉంటే.. వైట్‌హౌస్ ఫెలోషిప్ ప్రోగ్రాం ఆరేళ్లుగా కఠినంగా మారింది. అయినా తమ అద్భుత ప్రతిభతో వైట్‌హౌస్ ఫెలోషిప్ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. అందుకే వీరిని స్కిల్ బంచ్‌గా పిలుస్తున్నారు. పద్మిని పిళ్లైని వైట్‌హౌస్ వెబ్‌సైట్ ప్రశంసించింది. గతంలో ఎంఐటీలో ట్యూమర్ సెలెక్టివ్ నానోథెరపీపై చేసిన టీమ్‌కు పద్మిని నాయకత్వం వహించింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Two indian americans appointed as white house fellows
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com