TANA Pickleball Tournament: తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) మహాసభలను పురస్కరించుకొని జూన్ 22న జార్జియా రాష్ట్రంలోని గ్రేటర్ అట్లాంటా – ఆల్ఫారెట్టాలోని ఫోర్టియస్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన తానా పికిల్‌బాల్ టోర్నమెంట్ అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో 50కు పైగా జట్లు పాల్గొని ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించాయి.
ఈ పోటీల విజయవంతానికి తానా నేతలు, వాలంటీర్లు తమకు తమ వంతు కృషిని పెట్టారు. తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు ఈ టోర్నమెంట్ నిర్వహణకు సత్వర మార్గనిర్దేశనం అందించగా, బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ లావు సమగ్ర పర్యవేక్షణ వహించారు.

కాగా,భరత్ మద్దినేని (తానా కోశాధికారి), వినయ్ మద్దినేని (ఫౌండేషన్ కోశాధికారి), కిరణ్ గోగినేని (ఫౌండేషన్ జాయింట్ కోశాధికారి), మధుకర్ యార్లగడ్డ (ప్రాంతీయ ప్రతినిధి – సౌత్ ఈస్ట్) వంటి నాయకులు టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి టోర్నమెంట్ రూపకల్పనను సమర్థవంతంగా నిర్వహించి, కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. చలమయ్య బచ్చు, లక్కీ, ఉదయ్ తదితరులు టోర్నీ విజయానికి అవసరమైన మద్దతును అందించారు.

ఇక మహిళా సేవల సమన్వయకర్తగా సోహిని అయినాల, శశి దగ్గుల, చందు, లక్ష్మి, ఉదయ్, ఎజెల్ వంటి వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా సహకరించారు. టోర్నమెంట్ విజయవంతంగా జరగడంలో వీరి భాగస్వామ్యం ఎనలేనిది.

ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సమాజం లో కలిసిమెలిసి పనిచేయగల సామర్థ్యాన్ని చాటిచెప్పింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి తానా నేతలు ధన్యవాదాలు తెలిపారు. పికిల్‌బాల్ వంటి వినోదాత్మక ఆటల ద్వారా తెలుగు సమాజాన్ని ఒక్కటిగా కట్టిపడేసే ప్రయత్నానికి ఇది నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.

