Homeప్రవాస భారతీయులుTANA Mahasabhalu 2025: తెలుగు తారలతో రంజుగా తానా వేడుకలు! పూర్తి జాబితా ఇదే

TANA Mahasabhalu 2025: తెలుగు తారలతో రంజుగా తానా వేడుకలు! పూర్తి జాబితా ఇదే

TANA Mahasabhalu 2025 : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండు సంవత్సరాలకోసారి నిర్వహించే మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈసారి తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జూలై 3 నుండి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో జరగనున్నాయి. అమెరికాలోని నలుమూలల నుండి తెలుగువారు, అలాగే అమెరికా, ఇండియా నుండి రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీతారలు మరియు ఇతర ప్రముఖులు ఈ మహాసభలకు హాజరై సందడి చేయనున్నారు.

ఈసారి మహాసభలకు సినీరంగం నుండి పలువురు హీరోలు, హీరోయిన్‌లు, సంగీత దర్శకులు, నేపథ్య గాయనీ గాయకులు వస్తున్నారు. వీరితోపాటు యాంకర్లు, ఇతర చిన్న, పెద్ద తారలంతా తరలి వస్తున్నారు.

టాలీవుడ్ నుండి సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, హీరో నిఖిల్, యాంకర్ సుమ, దర్శకులు అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, ప్రముఖ సంగీత దర్శకులు థమన్, గాయనీ గాయకులు చిత్ర, సునీత, ఎస్.పి.బి. చరణ్, శ్రీకృష్ణ, సింహ, అలాగే గాయని శోభారాజు, జబర్దస్త్ హీరోయిన్ సత్యశ్రీ తదితరులు ఈ వేడుకలకు వస్తున్నారు. వీరితోపాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యే ఈ మహాసభలకు అందరూ రావాలని కాన్ఫరెన్స్ నిర్వాహకులు కోరారు.

ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఆఫర్: ఒకటి కొంటే ఒకటి ఉచితం!
తానా మహాసభల కోఆర్డినేటర్ ఉదయ్‌కుమార్ చాపలమడుగు ఒక అద్భుతమైన రిజిస్ట్రేషన్ ఆఫర్‌ను ప్రకటించారు. జూన్ 8వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక టిక్కెట్‌కు ఇంకో టిక్కెట్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్ పొందాలనుకున్నవారు పోస్టర్‌లో చూపిన విధంగా కోడ్‌ను ఉపయోగించుకోవచ్చు.

జూలై 4, 5వ తేదీల వరకు సాధారణ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అయితే, ఈ “ఒకటి కొంటే ఒకటి ఉచితం” (BOGO) ఆఫర్ జూన్ 8వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెంటనే మీరు మహాసభలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి. ఇతర వివరాల కోసం కాన్ఫరెన్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

కాన్ఫరెన్స్ వెబ్‌సైట్: tanaconference.org

రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://tanaconference.org/event-registration.html

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version