Canada: తేట తెలుగు..కెనడా- అమెరికా తెలుగు సదస్సులో తేనేలొలికింది..

Canada: ‘తేట తెలుగు’ తేనే లొలుకు అన్నారు పెద్దలు.. తెలుగు వారు ఎక్కడున్నా సరే.. తమ ప్రాంతంపై, భాషపై మమకారం చంపుకోరు.. సప్త సముద్రాలు దాటి అగ్రరాజ్యాలు చేరినా సరే తెలుగుపై మమకారాన్ని మాత్రం వదులుకోరు. కెనడా-అమెరికా తెలుగు సదస్సు వేదికగా మరోసారి ‘తెలుగు’ వెలిగింది. కెనడా- అమెరికా తెలుగు సదస్సు ద్విగ్విజయంగా సాగింది. కెనడా-తెలుగు సదస్సులో 50% కెనడియన్ రచయితలు, 50% అమెరికా రచయితలు పాల్గొని కవితల రూపంలో, కథల రూపం లో, ప్రసంగాల రూపంలో […]

Written By: NARESH, Updated On : November 26, 2021 12:59 pm
Follow us on

Canada: ‘తేట తెలుగు’ తేనే లొలుకు అన్నారు పెద్దలు.. తెలుగు వారు ఎక్కడున్నా సరే.. తమ ప్రాంతంపై, భాషపై మమకారం చంపుకోరు.. సప్త సముద్రాలు దాటి అగ్రరాజ్యాలు చేరినా సరే తెలుగుపై మమకారాన్ని మాత్రం వదులుకోరు. కెనడా-అమెరికా తెలుగు సదస్సు వేదికగా మరోసారి ‘తెలుగు’ వెలిగింది. కెనడా- అమెరికా తెలుగు సదస్సు ద్విగ్విజయంగా సాగింది.

Canada

కెనడా-తెలుగు సదస్సులో 50% కెనడియన్ రచయితలు, 50% అమెరికా రచయితలు పాల్గొని కవితల రూపంలో, కథల రూపం లో, ప్రసంగాల రూపంలో తమ ప్రతిభని వెలిబుచ్చారు.  ఈ సదస్సుతో అమెరికా-కెనడా రచయితల మధ్య పరిచయాలు, సత్సంబంధాలు పెరిగి, ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యం  మరింత  వెలుగు వెలిగింది. . ఈ విషయమై మొదటి సారి సదస్సులో పాల్గొన్న అనేకమంది కెనడా రచయితలు తమ హర్షం వ్యక్తం చేశారు.

సరిహద్దు గీతని చెరిపేస్తూ కెనడా అమెరికా రచయితలందరూ సంబరంగా జరుపుకున్న ఇటువంటి పండుగలు తరచూ జరగాలని, మునుముందు కూడా రెండు దేశాలూ కలిసి సదస్సులు నిర్వహించాలని అనేకమంది మిత్రులు, శ్రేయోభిలాషులూ ఆశాభావం వ్యక్తం చేసారు.

ఈ సదస్సును 12 వేదికలుగా విభజించారు. ప్రతివేదిక నిర్వాహకులూ, సాంకేతిక నిపుణులూ,  తమ వేదిక మీద ప్రసంగించాల్సిన అనేక మంది రచయితలతో కలిసి సమావేశాలు నిర్వహించారు. ఇందులోనే సందేహ నివృత్తి చేసి, జూం నిర్వహణలో అంతరాయం కలగకుండా, సభని అతి సమర్థవంతంగా జరిపారు. సభని అందంగా తీర్చిదిద్దడంలో జూం హోస్ట్ ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారు.

సదస్సుల విషయంలో అనుభవం లేని మమ్మల్ని వేలు పట్టుకుని నడిపిస్తూ, ఎంతో ఓర్పుతో  ప్రతి విషయాన్నీ వివరిస్తూ, అతి క్లిష్టమైన విషయాలని సులభంగా పరిష్కరిస్తూ,  సహనానికి మారుపేరేమో అనిపించిన గురుతుల్యులు వంగూరి చిట్టెన్రాజు కెనడా తెలుగువారి తరఫున అనేక ధన్యవాదాలు తెలిపారు.  లక్ష్మీ రాయవరపు, తెలుగుతల్లి కెనడా వెబ్ మాసపత్రిక సంపాదకురాలు  కృషి, అకుంఠిత దీక్ష, మొక్కవోని సంకల్పం  ఈ సదస్సు కి చాలా శోభమానమైంది. కెనడా మినిష్టరు ప్రసాద్ పండా, తనికెళ్ళ  భరణి, సుద్దాల అశోక్ తేజ, వడ్డేపల్లి కృష్ణ, డేనియల్ నాజర్ , భువనచంద్ర, బలభద్రపాత్రుని రమణి, మహెజబీన్ సదస్సుకి హాజరై తమ ప్రసంగాలతో ప్రేక్షకులనలరించారు.

Also Read: కెనడాలో ఘనంగా కార్తీక దీపోత్సవం

Canada

వంగూరి ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా వెబ్ మాస పత్రిక ముఖ్య నిర్వాహకులు, టొరాంటో తెలుగు టైంస్, ఓంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు వాహిని, ఆటవా తెలుగు అసోసియేషన్, కాల్గేరీ తెలంగాణా అసోసియేషన్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరాంటో కలిసి ఈ సదస్సుని విజయవంతంగా నిర్వహించారు.

-సదస్సు వీడియోను కింద లింక్ లో చూడొచ్చు..

https://app.frame.io/presentations/c870513f-0f95-4ed4-91a1-e7ab2902ba33

Also Read: ప్రమోషన్స్​కోసం రంగలోకి దిగుతున్న పుష్పరాజ్​