Homeట్రెండింగ్ న్యూస్Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’

Chai Pani: భారతీయ వంటలకు ప్రాధాన్యం ఉంటుంది. విదేశాల్లో మన వారు ఇరగదీస్తుంటారు. దీంతో అమెరికా అయినా అట్లాంటిక్ అయినా మన రుచులు చూస్తే ఇక విడిచిపెట్టరు. నాలుక చాచి రుచులు ఆస్వాదిస్తుంటారు. అంతటి రుచి మన వంటల్లో కనిపిస్తుంది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి బారతిని అన్నట్లు మన వంటల ఘుమఘుమలు అమెరికాను సైతం అతలాకుతలం చేస్తున్నాయి. మన వారి వంటలకు అక్కడి వారు ఫిదా అవుతున్నారు. దీంతో భారతయ రెస్టారెంట్లు సందడిగా మారుతున్నాయి. అక్కడ మన వారి వంటల వ్యాపారం కాస్త మూడు ఫిజాలు ఆరు బర్గర్లుగా సాగుతోందనడంలో అతిశయోక్తి లేదు.

Chai Pani
Chai Pani restaurant

అమెరికాలోని ఓ భారతీయ రెస్టారెంట్ దేశ అత్యుత్తమ రెస్టారెంట్ గా ఎంపికవడం విశేషం. భారతీయ వంటకాలకు ఎంత డిమాండ్ ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. నార్త్ కరోలినా యాష్ విల్ లోని చాయ్ పానీ అనే రెస్టారెంట్ దేశంలోనే మంచి రెస్టారెంట్ గా గుర్తింపు పొందింది. న్యూయార్క్ స్టేట్ పరిధిలో ఉత్తమ షెఫ్ గా మన భారతీయుడు చింతన్ పాండ్యా ఎంపికవడం తెలిసిందే. దీంతో అమెరికాలో కూడా మన ఇండియా రుచులకు ఎంతటి గిరాకీ ఉంటుందో అర్థమవుతోంది.

Also Read: Sudigali Sudheer: సుధీర్ జబర్దస్త్ వదిలేయడానికి సినిమాలే కారణమా ? మరి పక్క ఛానెల్స్ లో ఎందుకు చేస్తున్నాడు

షికాగోలో నిర్వహించిన జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఈ మేరకు విజేతలను ప్రకటించారు. దీంతో భారతీయుల వంటల ప్రావీణ్యత వెలుగులోకి వచ్చింది. మన వంటలకు అమెరికన్లు సైతం భలే ఆకర్షితులవుతున్నారు. అందుకే నలభీమ పాకం అని మన వంటలను ముద్దుగా పిలుచుకోవడం పరిపాటే. మన దేశ వంటలకు విదేశాల్లో కూడా గుర్తింపు లభించడం విశేషమే. అందుకే భారతీయ రెస్టారెంట్ కు ఉత్తమ రెస్టారెంట్ గా అవార్డు రావడం అభినంచదగ్గ విషయమే.

Chai Pani
Chai Pani restaurant

కరోనా కారణంగా రెండు సంవత్సరాలు అవార్డులు ఇవ్వకపోవడంతో ఈ సంవత్సరం ఇచ్చారు. ఇందులో బారతీయ రెస్టారెంట్ ఉండటం అభినందనీయం. అమెరికా సంస్కృతి, వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా అవార్డులు కేటాయించారు. దీంతో భారతీయులకు ఉత్తమ రెస్టారెంట్, ఉత్తమ చెఫ్, బేకరీ తదితర అవార్డులు గెలుచుకోవడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతీయుల ప్రతిభ ఎక్కడున్నా వెలుగులోకి రావడం సంతోషదాయకమే. మొత్తానికి భారతీయ వంటలకు అమెరికన్లు కూడా ఇష్టపడటం విశేషం.

Also Read:BJP Targeted Southern States: దేశ రాజకీయం దక్షిణాది వైపు ఎందుకు చూస్తోంది? తెలంగాణలో బీజేపీ కొత్త ప్లాన్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular