https://oktelugu.com/

Canada Diwali Celebrations: కెనడా దేశంలో అంబరాన్ని అంటిన  దీపావళి సంబరాలు

Canada Diwali Celebrations: కెనడా దేశంలోని ఒంటారియో రాష్ట్రంలో ఉన్న డుర్హాం రీజినల్ లో తెలుగు వారంతా కలిసి దీపావళి సంబరాలను ఘనంగా  జరుపుకున్నారు.   డుర్హం తెలుగు  సంస్థ  ఆధ్వర్యంలో గ్రాండ్ దీపావళి ఈవెంట్ ని ఈ నెల 13 వ తారీఖున కెనడా ఒషావా నగరం లో ఘనంగా నిర్వహించారు.  చిన్నారుల కేరింతలతో, సాంస్కృతిక  కార్యక్రమాలతో వేదిక కన్నుల పండుగయ్యింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కెనడా ఎంపీ హన్రబుల్ ర్యాన్ టర్న్ బుల్ ముఖ్య అతిధి గా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2021 / 02:12 PM IST
    Follow us on

    Canada Diwali Celebrations: కెనడా దేశంలోని ఒంటారియో రాష్ట్రంలో ఉన్న డుర్హాం రీజినల్ లో తెలుగు వారంతా కలిసి దీపావళి సంబరాలను ఘనంగా  జరుపుకున్నారు.   డుర్హం తెలుగు  సంస్థ  ఆధ్వర్యంలో గ్రాండ్ దీపావళి ఈవెంట్ ని ఈ నెల 13 వ తారీఖున కెనడా ఒషావా నగరం లో ఘనంగా నిర్వహించారు.  చిన్నారుల కేరింతలతో, సాంస్కృతిక  కార్యక్రమాలతో వేదిక కన్నుల పండుగయ్యింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కెనడా ఎంపీ హన్రబుల్ ర్యాన్ టర్న్ బుల్ ముఖ్య అతిధి గా విచ్చేసి దీపావళి సంబరాలను ప్రారంభించారు.  ఈ సంవత్సరం అద్భుత విజయాలను సాధించిన తెలుగు వారిని అభినందిస్తూ షీల్డ్స్ బహుకరించారు.   అంతే కాకుండా ఈ కార్యక్రమానికి సహకరించిన తెలుగు ప్రముఖులను సత్కరించారు.

    Canada Diwali Celebrations

    భారతీయ సంస్కృతీ ప్రపంచానికి ఎంతో నేర్పించింది. భారతీయుల కృషి కెనడా దేశ అభివృద్ధిలో భాగమయ్యారని ఎంపీ ర్యాన్ కొనియాడారు.  డుర్హం తెలుగు వాసుల అందరికీ తన అండదండలు ఎప్పుడు ఉంటాయని ఎంపీ ర్యాన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు వారందరి తరపున రమేష్ ఉప్పలపాటి దీపావళి పండుగను కెనడా నేషనల్ హాలిడేగా ప్రకటించేందుకు కెనడా పార్లమెంట్ లో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.  దానికి  ఎంపీ ర్యాన్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా తన అభిప్రాయాన్ని కెనడా పార్లమెంట్ సమావేశాలలో వినిపిస్తానని తెలియచేశారు.

    ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డీటీసీ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి, కార్య వర్గ సభ్యులు అయిన రవి మేకల, గౌతమ్ పిడపర్తి, శ్రీకాంత్ సింగిశెట్టి ,వెంకట్ చిలువేరి,సర్ధార్ ఖాన్ మరియు కమల మూర్తిలను ఆయన ప్రశంసించారు. ఈ దీపావళి వేడుకల్లో దాదాపు 550 తెలుగు, కెనడా సభ్యులు పాల్గొన్నారు.  వివిధ   క్రీడా, ఆటల, సాహిత్య కార్యక్రమాలతో దీపావళి పటాసులు వెలిగించి, షడ్రసోపేతమయిన తెలుగు వంటకాలు ఆరగించారు.

    Also Read: దివాళీ రోజున బాణసంచా.. తెలుగు రాష్ట్రాల్లో అనుమతి ఉందా??

    Canada Diwali Celebrations

    టొరంటో తెలుగు టైమ్స్ సంపాదకులు గౌ. సర్దార్ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ తెలుగు సభ ద్విగ్విజయంగా ముగిసింది.  ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ తెలుగు వారంతా చేసిన ఈ దీపావళి సంబురాల  ప్రయత్నం ఫలించింది. అందరూ అనుభూతులు పంచుకొని పండుగను ఘనంగా నిర్వహించారు.

    వీడియో

    Also Read: కెనడాలో ఘనంగా కార్తీక దీపోత్సవం