https://oktelugu.com/

Florida: ఫ్లోరిడాలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన భారతీయుడు

మొదట్లో తప్పుడు నెపంతో 50,000 డాలర్లు కావాలని బలవంతం చేశారు, మరుసటి రోజు మళ్లీ 30,000 డాలర్ల కోసం టార్గెట్‌ చేశారు. బాధితురాలు అప్రమత్తం కావడంతో పోలీసులు స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి నిందితులను అరెస్ట్‌ చేశారు. బాడీ కెమెరా ఫుటేజ్, విచారణ వీడియోలు ముగుస్తున్న సంఘటనలను సంగ్రహించాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 17, 2024 / 01:47 PM IST

    Florida

    Follow us on

    Florida: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ స్కామర్లు.. భాధితులకు ఏటా బిలియన్ల డాలర్ల నష్టం కలిగిస్తున్నారు. ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్, టెలిఫోన్‌ ద్వారా స్కామ్ లకు పాల్పడుతున్నారు. ఇటీవల ఫ్లోరిడాలోని ఓకాలాలో 70 ఏళ్ల మహిళను తప్పుడు హెచ్చరికలు, వంచనతో మోసం చేశారు.

    టెక్నాలజీ సహాయంతో మోసం..
    మొదట్లో తప్పుడు నెపంతో 50,000 డాలర్లు కావాలని బలవంతం చేశారు, మరుసటి రోజు మళ్లీ 30,000 డాలర్ల కోసం టార్గెట్‌ చేశారు. బాధితురాలు అప్రమత్తం కావడంతో పోలీసులు స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి నిందితులను అరెస్ట్‌ చేశారు. బాడీ కెమెరా ఫుటేజ్, విచారణ వీడియోలు ముగుస్తున్న సంఘటనలను సంగ్రహించాయి.

    ప్రధాన నిందితుడు భారతీయుడు..
    ఈ మోసాలకు పాల్పడుతున్నవారిలో ప్రధాన నిందితుడు భారతీయుడని పోలీసులు గుర్తించారు. విచారణలో మొదట అతను నిర్దోషినని పేర్కొన్నాడు. కానీ తరువాత మోసాలను ఆర్కెస్ట్రేట్‌ చేసినట్లు ఒప్పుకున్నాడు. అతనికి అనేక రాష్ట్రాలలో ఇలాంటి సంఘటనలతో లింక్‌ ఉన్నట్లు అమెరికా పోలీసులు గుర్తించారు. వ్యవస్థీకృత మోసం, వృద్ధ బాధితుల నుండి భారీ దొంగతనంతో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మొత్తం నష్టాలు ఫ్లోరిడాలోనే 80,000 డాలర్లకన్నా ఎక్కువ జరిగినట్లు గుర్తించారు. . జార్జియాలో జరిగిన ఒక ప్రత్యేక సంఘటనలో, అదే బృందం 80 ఏళ్ల మహిళ నుండి 150,000 డాలర్ల విలువైన బంగారాన్ని మోసగించింది. పట్టుబడకుండా తప్పించుకోవడానికి, ప్రమేయాన్ని తిరస్కరించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, అధికారులు నిందితులను నేరాలతో ముడిపెట్టే సాక్ష్యాలను కలిపి ఉంచారు.

    ఇటీవలే నలుగురి అరెస్టు..
    అగ్రరాజ్యాం అమెరికాలో నలుగురు భారతీయులకు ఊహించని షాక్‌ తగిలింది. మానవ అక్రమ రవాణా కేసులో టెక్సాస్‌ పోలీసులు ఇటీవలే అరెస్టు వారెంట్లు జారీ చేశారు. అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నట్లు ఇటీవల గుర్తించిన పోలీసులు అందుకు భారతీయులే కారణం అని గుర్తించారు. ఈమేరకు అరెస్ట్‌ వారెంట్లు జారీ చేశారు.

    15 మంది అమ్మాయిలు..
    అమెరికాలోని ప్రిన్స్‌టన్‌లో పోలీసులు 15 మంది అమ్మాయిలను ఇటీవల పట్టుకున్నారు. విచారణలో వాళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అమ్మాయిల వెంట మగవాళ్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అమ్మాయిల అక్రమ రవాణాకు సంతోష్‌ కక్టూరి అని విచారణలో నిర్ధారించారు. దీంతో ప్రిన్స్‌టన్‌ పోలీసులు సీఐడీ డిటెక్టివ్‌లు సంతోష్‌ కక్టూ కోసం సెర్చ్‌ వారెంట్‌ జారీ చేశారు.

    నకిలీ కన్సల్టెన్సీ ద్వారా..
    డల్లాస్‌కు చెందిన నలుగురు నలుగురు భారత సంతతి వ్యక్తులు కన్సల్టెన్సీ నిర్వహిస్తూ ఉద్యోగాలు, ఉపాధి పేరుతో భారతీయ యువతలను అమెరికాకు అక్రమంగా తీసుకువస్తున్నారు. ఇందుకోసం నకిలీ పత్రాలు సృష్టిస్తున్నట్లు గుర్తించారు. అమెరికాకు వచ్చిన తర్వాత యువతులను బంధించినట్లు గుర్తించారు. ఇందుకు సంతోష్‌ కక్టూరి, అతని భార్య ప్రధాన బాధ్యులని పోలీసులు భావిస్తున్నారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లు, నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ల ఎలక్ట్రానిక్స్‌ని పరిశీలించి ఆపరేషన్‌ వివరాలను పోలీసులు తెలిపారు.

    వరుస మోసాలు..
    భారతీయులు అమెరికాలో వరుసగా అరెస్ట్‌ అవుతున్నారు. మోసాలకు పాల్పడుతూ అగ్రరాజ్య ప్రజలను, పోలీసులనే బురిడీ కొట్టిస్తున్నారు. తర్వాత పట్టుపడి జైలుపాలవుతున్నారు. దేశం కాని దేశంలో భారతీయులు అరెస్టు.. అక్కడి చట్టాలపై అవగాహన లేకపోవడంతో జైల్లలో మగ్గుతున్నారు.