https://oktelugu.com/

Kama Reddy News: భార్య వేధింపులు భరించలేని భర్త ఏం చేశాడంటే? ట్విస్ట్ ఇదే..

Kama Reddy News: మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్నాడో సినీకవి. మనిషిలోని మంచితనం మాయమై కర్కశత్వం బయటపడుతోంది. ఫలితంగా భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రయినా బంధుత్వం బలాదూర్ అవుతోంది. ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఫలితంగా దొరికిపోతున్నా ఆక్షణంలో మాత్రం వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలు తీసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. జీవితాంతం తోడుండాల్సిన భార్యను అర్థంతరంగా కడతేర్చి కటకటాలపాలయ్యాడో ప్రబుద్ధుడు. ఉన్నంతలో సర్దుకు పోకుండా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో భర్తను నిరంతరం […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 12, 2022 / 04:26 PM IST
    Follow us on

    Kama Reddy News: మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్నాడో సినీకవి. మనిషిలోని మంచితనం మాయమై కర్కశత్వం బయటపడుతోంది. ఫలితంగా భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రయినా బంధుత్వం బలాదూర్ అవుతోంది. ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఫలితంగా దొరికిపోతున్నా ఆక్షణంలో మాత్రం వారు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలు తీసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. జీవితాంతం తోడుండాల్సిన భార్యను అర్థంతరంగా కడతేర్చి కటకటాలపాలయ్యాడో ప్రబుద్ధుడు.

    Kama Reddy News

    ఉన్నంతలో సర్దుకు పోకుండా విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో భర్తను నిరంతరం వేధింపులకు గురిచేసే భార్యలను కడతేర్చాలని భావించాడు. ఎప్పుడు డబ్బులు కావాలని అడుగుతున్న భార్యను కొట్టి చంపాడో కట్టుకున్న కర్కశుడు. మృతదేహాన్ని పంటపొలాల్లో వేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. శవం పూర్తిగా కాలకపోవడంతో విషయం బయట పడింది.

    కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని మర్కల్ గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ శవం కనిపించింది. దీన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ 25న వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి రెండు స్పెషల్ టీమ్ లు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశాయి. గ్రామంలోని సీసీ పుటేజీలను పరిశీలించారు.

    Also Read: నడుము కింది భాగంలో నొప్పి ఉందా.. ఐతే – ఇలియానా

    గ్రామంలోకి వచ్చిన బొలెరో వాహనాన్ని గుర్తించారు. అది హైదరాబాద్ వైపు వెళ్లినట్లు తెలుసుకున్నారు. దీంతో దీనిపై విచారణ చేపట్టగా అసలు విషయాలు తెలిశాయి. మేడ్చల్ జిల్లా గండి మైసమ్మ ప్రాంతంలో ఉండే రంజాన్ ఖాన్, ఫాతిమా ఖాతున్ దంపతులు హైదరాబాద్ లో కూలిపని చేసుకుంటూ జీవించేవారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన బల్ రాంపూర్ కు చెందిన వారు. ఫాతిమా వేధింపులు తాళలేక రంజాన్ ఖాన్ నవంబర్ 24న రాత్రి ఒంటరిగా నిద్రిస్తున్న సమయంల కర్రతో తలపై బాది హత్య చేశాడు.

    రంజాన్ స్నేహితుడైన రిజాయ్ ఖాన్, నన్ బాబు, రిజ్వాన్ ఖాన్, పూజన్ సహాయంతో బొలెరో వాహనంలో ఫాతిమా మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా మర్కల్ గ్రామానికి తీసుకొచ్చి దహనం చేసి వెళ్లిపోయారు. రంజాన్ ఖాన్ ను ఏ1, రియాజ్ ఖాన్ ఏ2గా కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

    Also Read: ప్రేమించి పెళ్లాడాడు.. అయినా భార్య వదిలేసి వెళ్లిపోయింది.. కారణమిదే

    Tags