Balochistan : బెలూచీల స్వాతంత్ర్య పోరాటం ఇప్పటిది కాదు.. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బెలూచీలు స్వతంత్ర్యంకోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఎవరైతే బెలూచీలకు స్వాతంత్ర్యం కావాలని నాడు బ్రిటీష్ వారి ఎదుట పోరాడారో వారే ఇప్పుడు పాకిస్తాన్ పాలకులుగా బెలూచీల స్వాతంత్ర్య పోరాటాన్ని అణిచివేస్తున్నారు. అతడే ‘మహ్మద్ అలీ జిన్నా’.. ప్రముఖ న్యాయవాది అయిన ఈయన నేపాల్, భూటాన్ లాంటి సంస్థానాలతోపాటు బెలూచీలకు స్వాతంత్య్రం ఇవ్వాలని మాట్లాడిన లాయర్ జిన్నా..
విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత అధ్యక్షుడు అయిన జిన్నా ఇదే బెలూచీలను దారుణంగా అణచివేస్తున్నాడు.వేల మంది యువకులను చంపేశారు. ఇప్పటికీ దురాగతాలు చేస్తూనే ఉన్నారు.
బెలూచీల కోసం మహరంగ్ బెలూచీ అనే మహిళ క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వరకూ శాంతియుత పోరాటం సాగిస్తోంది. మొత్తం పాక్ విస్తీర్ణంలో 40 శాతం బెలూచీలదే. కానీ 4 శాతం మాత్రమే జనాభా అక్కడ ఉంది. గ్యాస్ , మినరల్స్ ఎన్నో బెలూచీస్తాన్ లో ఉన్నాయి. బంగారం, కాపర్ ఉంది. అవన్నీ దోచుకోవడానికి తప్పితే పాకిస్తాన్ బెలూచీల సంక్షేమం పట్టడం లేదు.
అక్కడ ఒక పోర్ట్ చైనా కట్టింది. ఒక ఎయిర్ పోర్ట్ కట్టారు. ఒక్క బెలూచీలకు అందులో ఉద్యోగాలు కల్పించలేదు. దీంతో ఇప్పుడు 2020 తర్వాత ఓ పోరాటం మొదలుపెట్టారు.
స్వతంత్ర బెలూచిస్తాన్ కల నెరవేరబోతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.