Kannappa: కన్నప్ప విషయంలో మంచు విష్ణు ధైర్యం ఏంటి..? ఆయనకి వెనకనుంచి సపోర్ట్ చేస్తున్నవారెవరు..?

కన్నప్ప అనే సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా కోసం 150 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించి ఈ సినిమా మీదనే ఆయన వ్యయ ప్రయాసాలను పెడుతున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : May 18, 2024 4:25 pm

Who is supporting Manchu Vishnu

Follow us on

Kannappa: మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ అయితే కొట్టలేకపోయాడు. దానికి కారణం ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ లోనే చాలావరకు లోపాలు ఉన్నాయని చాలా మంది చెబుతూ ఉంటారు…

ఇక మొత్తానికైతే ఆయన ఇప్పుడు కూడా స్టార్ హీరోగా గుర్తింపు పొందాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఆయన హీరోగా కన్నప్ప అనే సినిమాని భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా కోసం 150 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయించి ఈ సినిమా మీదనే ఆయన వ్యయ ప్రయాసాలను పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ కొట్టి ఇప్పుడున్న స్టార్ హీరోలకు తను ఏమాత్రం తీసిపోడు అనే విధంగా తను తాను రిప్రజెంట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

అయితే ఈ ప్రాసెస్ లోనే ఈ సినిమా నిండా స్టార్ కాస్టింగ్ తో నింపేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో బడ్జెట్ అనేది 150 నుంచి 200 కోట్ల వరకు కూడా పెరిగిపోతుంది. అయితే ఏ ధైర్యంతో విష్ణు ఇలాంటి ఒక సాహసాన్ని చేస్తున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఇలా ఉంటే విష్ణు బ్యాగ్రౌండ్ నుంచి ప్రభాస్ భారీగా సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సినిమా షూటింగ్ లో పాల్గొనడమే కాకుండా దానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా తను చాలా వరకు సినిమాకు హెల్ప్ చేస్తానని సినిమా వెంట ఉంటానని విష్ణుకి మాటిచ్చాడట…

అందువల్లే ఆయన ఈరోజు సినిమా కోసం ఎన్ని డబ్బులు అయిన సరే పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రభాస్ తన ఫ్రెండ్స్ ని ఆదుకోవడంలో ఎప్పుడు ముందుంటాడు అని చెప్పడానికి ఈ సంఘటనని మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది…