Pulasa Fish : పులస.. ఈ చేప గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాల వారికి ఈ చేప సుపరిచితం. తెలుగు రాష్ట్రాల్లోని సీ ఫుడ్ ప్రియులకు ఈ చేప ప్రత్యేకమే. పుస్తెలమ్మి అయినా పులస తినాలనే సామెత గోదావరి జిల్లాల్లో వినిపిస్తుంటుంది. సినిమాల్లో కూడా ఈ పులస గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంటుంది. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరి నదిలో లభిస్తుంటాయి. కానీ ఏటా వీటి లభ్యత తగ్గుతూ వస్తోంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఒక మత్స్యకారుడు వలకు పులస చిక్కింది. దానికి వేలం వేస్తే 24 వేల రూపాయలు పలికింది. అయితే ఒకటి రెండు చోట్ల పులస చిక్కినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఎక్కడ లభించిన ఆనవాళ్లు లేవు. అయితే ప్రధానంగా సముద్రం నుంచి నదిలోకి ఈ అరుదైన చేప ప్రవేశిస్తుంది. కానీ కొన్నేళ్లుగా బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు పులస రావడం లేదని తెలుస్తోంది. రాజాగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ రీఛార్జ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో కూడా ఈ షాకింగ్ విషయం తెలుగులోకి వచ్చింది.
* విరివిగా లభ్యత
దశాబ్దాల కిందట గోదావరి నదిలో విపరీతంగా పులసలు లభ్యమయ్యేవి. హిందూ మహాసముద్రం నుంచి వేలాది కిలోమీటర్లు ఈదుకుంటూ బంగాళాఖాతంలోకి ఈ పులసలు వచ్చేవి. అలా గోదావరిలో చేరేవి.అయితే పెరుగుతున్న కాలుష్యం, గోదావరి తీరం వెంబడి నెలకొన్న ఆటంకాలు వంటి కారణాలతో అవి గోదావరి నదిలో చేరకుండా.. నేరుగా పశ్చిమ బెంగాల్, ఒడిస్సా వైపు వెళ్తున్నాయి. ఈ కారణంగానే పులస లభ్యత తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.
* ప్రపంచ ఖ్యాతి
పులసకు ప్రపంచ ఖ్యాతి ఉంది. ఈ సీజన్లో పులసల కోసమే చాలామంది గోదావరి జిల్లాల్లో అన్వేషిస్తుంటారు. దీని ప్రాముఖ్యత పెరగడంతో ఒక్కసారైనా తినాలన్న భావనతో ఎక్కువమంది ఉంటారు. కానీ వీటి లభ్యత లేకపోవడంతో వారి ఆశలు తీరడం లేదు. పుస్తెలు కాదు నిలువు బంగారం అమ్మినా.. కొనుగోలు చేయలేని స్థితిలోకి పులసలు చేరుకున్నాయి. వీటి లభ్యత లేక అటు మత్స్యకారులకు గిట్టుబాటు లేదు. తినాలనుకున్న వారికి కోరిక తీరడం లేదు.
* నదిలో పునరుత్పత్తి
గోదావరి నది ఉదృతంగా ప్రవహించినప్పుడు బంగాళాఖాతం నుంచి పులసల గుంపు గోదావరి వైపు వచ్చేవి. నదిలోనే పునరుత్పత్తి చేసేవి. దీంతో పుష్కలంగా అవి దొరికేవి. అయితే వివిధ అధ్యయనాలు సంస్థలు.. పులసలను గోదావరి వైపు మళ్ళించే ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. వాస్తవానికి ఏటికి ఎదురీదుతూ వచ్చే వాటిని పులస అంటారు. సముద్ర జలాల్లో ఉన్నప్పుడు వీటిని ఇలస అని పిలుస్తారు. నదీ జలాల్లోకి ప్రవేశించాక పులసగా అభివర్ణిస్తారు.