https://oktelugu.com/

Mohan Babu: ఆ సినిమా ముందు అప్పుల పాలయ్యా.. మోహన్ బాబు వీడియో వైరల్..

మోహన్ బాబు విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన నివాసం వద్ద ఇటీవల జరిగిన ఘర్షణ వాతావరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో ఆయన గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు వైరల్ గా మారుతున్నాయి

Written By:
  • Srinivas
  • , Updated On : December 13, 2024 / 01:32 PM IST

    Mohan-Babu

    Follow us on

    Mohan Babu: మోహన్ బాబు విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన నివాసం వద్ద ఇటీవల జరిగిన ఘర్షణ వాతావరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో ఆయన గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఒకప్పుడు మోన్ బాబు కలెక్షన్ కింగ్ గా సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగాడు. ఆ తరువాత ఆయన సినిమాలు పెద్దగా ఆడడం లేదు. అయితే ఆయన జీవితంలో ‘పెదరాయుడు’ మూవీ ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతోనే మోహన్ బాబు కెరీర్ మలుపు తిరిగిందని చెప్పవచ్చు. ఈ సమయంలో మోహన్ బాబు పడిన కష్టాల గురించి ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైలర్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏం చెప్పాడంటే?

    టాలీవుడ్ ఇండస్ట్రీలోని లెజెండ్ హీరోల్లో మోహన్ బాబు ఒకరు. విలన్ పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్ గా పలు సక్సెస్ సినిమాలను తీశారు. ఆయన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలు తీసినా ‘పెదరాయుడు’ సినిమా మరిచిపోలేదని చెబుతూ ఉంటాడు. అయితే పెదరాయుడు సినిమా తీయకముందు తాను తీసిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో తీవ్ర కష్టాల్లో కూరుకుపోయారు.

    ఈ సమయంలో తమిళంలో రిలీజ్ అయిన ‘నట్టమై’ అనే సినిమాను చూసిన తరువాత మోహన్ బాబును రజనీకాంత్ పిలిచాడు. ఈ సినిమా హక్కులు కొనుక్కోవాలని సూచించారు. దీంతో ఆర్బీ చౌదరి నుంచి ఆ సినిమాను తక్కువ ధరకే రైట్స్ కొనుగోలు చేశారు. ఆ తరువాత రవిరాజను ఈ సినిమా చూసి చేద్దామని అడగగా.. ఆయన సినిమా చూసి చేద్దామని చెప్పారు. అయితే ఇదే సమయంలో రజనీకాంత్ ఫోన్ చేసి తాను తండ్రి పాత్రలో నటిస్తానని చెప్పారు. ఒక స్టార్ హీరో తండ్రి పాత్రలో నటించడానికి రెడీ అయిన రజనీని చూసి మోహన్ బాబు షాక్ అయ్యారు. వెంటనే రజనీకాంత్ సొంత ఖర్చులతో ఫొటో షూట్ చేసి ఫోటోలను రవిరాజకు పంపించాడు. ఈ ఫొటోలను చూసి రవిరాజ పినిశెట్టి ఆశ్చర్యపోయారు.

    ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు మోహన్ బాబు తీవ్ర కష్టాల్లో కూరుకుపోయినట్లు రజనీకాంత్ కు తెలిసింది. దీంతో రజనీకాంత్ చెన్నై నుంచి మోహన్ బాబు వద్దకు రైళ్లో వచ్చారు. ఆ తరువాత మోహన్ బాబుకు రూ.45 లక్షలు ఇచ్చి ‘నువ్వు కష్టాల్లో ఉన్నావని తెలిసింది.. సినిమా సక్సెస్ అయిన తరువాత తిరిగి ఇవ్వు..’ అన్నారు. దీంతో రజనీకాంత్ నిజాయితీ చూసి ఉద్వేగానికి ఫీలయినట్లు మోహన్ బాబు తెలిపారు. రజనీ చెప్పిన విధంగానే ‘పెదరాయుడు’ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ అయింది. ఆ తరువాత తన జీవితమే మారిపోయినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.