సీనియర్ బ్యూటీ టబు కొత్త అవతారం ఎత్తబోతునట్లు తెలుస్తోంది. అవతారం అంటే.. అదే ఎదో కొత్త గెటపో.. లేక మరొకటో కాదు లేండి, టబు నిర్మాతగా మారబోతుంది. ఉన్నట్టు ఉండి.. నిర్మాణ రంగంలోకి ఎందుకు వస్తోంది అంటే.. సంతృప్తి కోసమట. టబు అభిమానులకు ఇది షాకింగ్ నిర్ణయమే. టబులో ఈ మార్పుకి కారణం ఒంటరి తనమే అట. టబుకి పెళ్లి కాలేదు, కాదు చేసుకోలేదు. జీవితాన్ని సినిమా రంగానికే అంకితం చేసింది. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచానికే కట్టుబడి పోయింది.

మధ్యలో ఓ హీరోతో సన్నిహితంగా ఉన్నా.. ఆ తర్వాత ఆమె కెరీర్ లో ఎన్నో ప్రేమకథలు ఉన్నాయి. మరెందరో ఆమె మెప్పు కోసం ప్రయత్నాలు చేశారు. ఎవరు ఎన్ని చేసినా.. ఆమె మాత్రం పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక లేటు వయసులో కూడా బోల్డ్ పాత్రలు చేస్తూ.. నిజమైన హీరోయిన్ అనిపించుకుంది. అయితే, ఈ మధ్య టబుకి ఓ కథ బాగా నచ్చిందట.
ఓ కొత్త దర్శకుడు ఆ కథను చెప్పాడు. ఆ కథను ఒక వెబ్ ఫిల్మ్ గా చేయాలని టబు ప్లాన్ చేస్తోంది. కేవలం కథ నచ్చడం కారణంగానే నిర్మాతగా మారబోతుంది. ప్రస్తుతం టబు తన నిర్మాణ సంస్థ ప్రారంభానికి సంబంధించిన పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. అలాగే ఈ ఒక్క కథతోనే ఆగిపోకుండా తనకు నచ్చే కథలను సినిమాలుగా మలచాలనే ఆలోచనలో కూడా ఉంది.
కాకపోతే.. బడ్జెట్ విషయాల్లో మాత్రం పరిమితులు ఉంటాయని.. అలాగే తాను ఎక్కువగా ఓటీటీ సినిమాలే చేయాలని నిర్ణయించుకుందట. ఓటీటీ అయితే, నష్టాలు ఉండవు. అందుకే ఓటీటీకి సరిపోయే కొత్త కథలు వింటూ మొత్తానికి టబు తన భవిష్యత్తును నిర్మాతగా ప్లాన్ చేసుకుంటుంది. అన్నట్టు తాను నిర్మించబోయే మొదటి సినిమాలో టబు కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది.
మొత్తమ్మీద హీరోయిన్ గా సంపాదించిన డబ్బులను సినిమా నిర్మాణంలో పెడుతుంది. డబ్బులు పెట్టినా.. ముందు సినిమా ప్రొడక్షన్ పై అవగాహన ఉండాలి. టబుకి ఆ అనుభవం లేదు. మరి నిర్మాతగా ఆమె ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.