Singer Chinmayi: సింగర్ చిన్మయి కరుడుగట్టిన ఫెమినిస్ట్. పరిశ్రమలో ఆడవాళ్ళపై జరుగుతున్న వేధింపులపై ఆమె గళమెత్తారు. ప్రముఖ రచయిత వైరముత్తు మీద ఆమె చాలా కాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. వైరముత్తు తనకున్న పలుకుబడితో ఎందరో అమ్మాయిలను లైంగికంగా వేధించాడనేది ఆమె ప్రధాన ఆరోపణ. చిన్మయి అతని మీద కేసులు కూడా పెట్టారు. అతన్ని ఎవరైనా గౌరవించినా, సత్కరించినా కూడా చిన్మయి ఊరుకోరు. ఆ మధ్య సీఎం స్టాలిన్ నేరుగా వెళ్లి కలిశారు.
ఈ విషయాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. చిన్మయి మీ టూ ఉద్యమం కారణంగా కెరీర్ కూడా కోల్పోయారు. కోలీవుడ్ నుండి బహిష్కరణ ఎదుర్కొన్నారు. అయినా నమ్మిన సిద్ధాంతం వదలకుండా ఆమె పోరాటం చేస్తున్నారు. సమాజంలో ఎక్కడ ఆడవాళ్లకు అన్యాయం జరిగినా చిన్మయి స్పందిస్తారు. వాళ్ళ తరపున పోరాడతారు. తాజాగా ఓ నెటిజన్ ఆమెతో చేసిన అసభ్యకర చాటింగ్ చిన్మయి బయటపెట్టారు.
ఓ వ్యక్తి తనకు మొదట్లో మర్యాదగా సందేశాలు పంపాడట. నాకు మీరంటే చాలా ఇష్టం. మా చెల్లికి కూడా వేధింపులు ఎదురయ్యాయి అంటూ మెసేజ్ లు పెట్టేవాడట. అయితే చిన్మయి వాటికి రిప్లై ఇవ్వలేదట. దాంతో తన నిజ స్వరూపం బయటకు తీశాడట. నీకు డబ్బులు ఇస్తాను నాతో పడుకుంటావా? నీకు లగ్జరీ లైఫ్, కావాల్సిన జీవితం ఇస్తాను అంటూ తనలోని చెడు ఆలోచనలు బయటపెట్టాడట. సదరు చాట్ స్క్రీన్ షాట్స్ చిన్మయి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సమాజంలో ఇలాంటి దుర్మార్గులు ఉన్నారంటూ ఏకిపారేసింది. చిన్మయి స్టార్ సింగర్స్ లో ఒకరు. ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. యశోద చిత్రం వరకు సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పింది. ఇటీవల సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. శాకుంతలం చిత్రంలో కూడా సమంత ఓన్ వాయిస్ ఉంది. దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ ఈమె భర్త. చిన్మయి ట్విన్స్ సంతానంగా ఉన్నారు. ఫెమినిస్ట్ గా చిన్మయి సోషల్ మీడియాలో నెగిటివిటీ ఎదుర్కొంటూ ఉంటుంది.
Exhibit for why one shouldn’t really trust some pieces of human flesh.
Insecure egocentric soup boy cannot even deal that I didn’t respond.
The worst case scenario of this sorta human being is the one that murders girls that say no to him. pic.twitter.com/paWFQDf0MP
— Chinmayi Sripaada (@Chinmayi) October 1, 2023