Shivaji sensational comments: కమెడియన్ గా, సినీ నిర్మాతగా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకొన్న బండ్ల గణేష్(Bandla Ganesh), మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి కొంతకాలం సినిమాలకు దూరమయ్యాడు. సినీ రంగం లో ఉన్నప్పుడు మొదటి నుండి ఆయన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ని ఎంతలా ఆరాదించేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముందుగా జనసేన పార్టీ లో చేరడం కోసం, కొన్ని లైవ్ డిబేట్స్ లో జనసేన తరుపున మాట్లాడి, రోజా లాంటోళ్ళతో కూడా గొడవపడ్డాడు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకో ఈయన్ని పార్టీ లో ఆహ్వానించలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లో చేరిన బండ్ల గణేష్, గత ఎన్నికల్లో సీట్ ఆశించాడు. కానీ రాలేదు,దీంతో రాజకీయాలకు కూడా విరామం ఇచ్చి తన వ్యాపారాలు చూసుకుంటూ రీసెంట్ గానే మళ్లీ సినీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయం లో ఆయన రాజకీయాల్లోకి కూడా గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్నాడని లేటెస్ట్ గా ఆయన తలపెట్టిన ఒక కార్యక్రమం చూస్తే అర్థం అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే గత ప్రభుత్వ హయాం లో చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అరెస్ట్ అయినప్పుడు ఆయన బెయిల్ మీద బయటకు వస్తే షాద్ నగర్ నుండి తిరుమల వరకు పాదయాత్ర మీదుగా వచ్చి శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నాడట. నిన్నటి నుండి ఆయన ఈ పాదయాత్ర ని మొదలుపెట్టాడు. మార్గం మధ్యలో ప్రముఖ నటుడు శివాజీ(Actor Shivaji) కూడా జాయిన్ అయ్యి, బండ్ల గణేష్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘చంద్రబాబు నాయుడు గారు బండ్ల గణేష్ కోసం ఇప్పటి వరకు చేసింది ఏమి లేదు. అయినప్పటికీ కూడా ఆయన అరెస్ట్ అయినప్పుడు, అయ్యో కోట్లాది మందికి ఎంతో మంచి చేసిన వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారే, ఇది కరెక్ట్ కాదు అనిపించి బయటకు వచ్చి తన గళం వినిపించాడు. టీడీపీ కార్యకర్తల్లో ఆ సమయంలో ధైర్యం సన్నగిల్లకుండా, పోరాట పటిమ నింపడానికి బండ్ల గణేష్ ప్రసంగాలు కూడా స్ఫూర్తిని ఇచ్చాయి’ అంటూ శివాజీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో మీరే చూడండి క్రింది వీడియోలో. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ వేసుకునే దుస్తుల గురించి శివాజీ చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూసాము. నెలరోజుల పాటు ఆయన పేరు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో మారుమోగిపోయింది. ఆ ఘటన తర్వాత శివాజీ బయటకు వచ్చి మాట్లాడడం ఇదే తొలిసారి. ఇకపోతే ఏ లాభం ఆశించకుండా బండ్ల గణేష్ ఇంత పెద్ద పాదయాత్ర చంద్రబాబు కోసం చేయడు, కూటమి ప్రభుత్వం అధికారం లో ఉంది కాబట్టి, కచ్చితంగా ఎదో ఒక పదవి ని ఆశించే ఈ పాదయాత్ర ని చేస్తుండొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#BandlaGanesh కి చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది… ఏమి లేదు…#SankalpaYatra #PadhaYatra #ChandrababuNaidu pic.twitter.com/fqzfA2bWpl
— M9 NEWS (@M9News_) January 19, 2026
