Rana Naidu 2 : విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో వచ్చిన ‘రానా నాయుడు’ నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఎంతటి సెన్సేషనల్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ ని చూసే సాహసం చేయలేదు కానీ, కుర్రాళ్ళు మాత్రం ఎగబడి చూసారు. వెంకటేష్ ని ఎప్పుడూ చూడని సరికొత్త కోణం లో చూసి ఎంజాయ్ చేశారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో వాడిన భూతులపై అప్పట్లో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. కోట్లమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో అభిమానించే వెంకటేష్ నోటి నుండి అలాంటి బూతు మాటలు రావడాన్ని అసలు జీర్ణించుకోలేకపోయారు. వెంకటేష్ వెబ్ సిరీస్ అంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ సహజంగానే చూస్తారు. అలా ఈ వెబ్ సిరీస్ ని చూసి వెంకటేష్ ని తిట్టుకున్నారు. ఎంతో అనుభవం ఉన్న వెంకటేష్ లాంటోళ్ళు కూడా ఇలాంటి బూతులు మాట్లాడడం శోచనీయం అంటూ కామెంట్స్ చేశారు.
విజయశాంతి వంటి వారు కూడా ఇలాంటి వెబ్ సిరీస్ లను బ్యాన్ చేయాలనీ, సినిమాలకు సెన్సార్ పెట్టినట్టుగానే, వెబ్ సిరీస్ లకు కూడా సెన్సార్ పెట్టాలని అప్పట్లో ఆమె డిమాండ్ చేసింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ హిట్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ కి సంబంధించి నేడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న వెంకటేష్ ని ‘రానా నాయుడు 2 ‘ కి సంబంధించిన అప్డేట్స్ ని అడిగారు. దీనికి ఆయన సమాధానం చెప్తూ ‘షూటింగ్ మొత్తం పూర్తి చేసేసాము.. ఈ ఏడాది లోనే విడుదల అవుతుంది. బహుశా సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు. పార్ట్ 1 కి ఏర్పడిన నెగటివిటీ ని చూసారా?, అడల్ట్ సన్నివేశాలు ఘోరంగా ఉన్నాయని మిమ్మల్ని చాలామంది తిట్టారు అంటూ ఒక రిపోర్టర్ వెంకటేష్ ని అడుగుతాడు.
దానికి వెంకటేష్ సమాధానం చెప్తూ ‘అంత నెగటివిటీ ఏర్పడిందా?, ఏమో నా దృష్టికి అయితే రాలేదు. సీజన్ 2 అడల్ట్ సన్నివేశాలతో పాటు, బూతుల వాడకం కూడా బాగా తగ్గించాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వెబ్ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా నటించారు. రానా ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ చేయగా, వెంకటేష్ క్రిమినల్ క్యారక్టర్ చేశాడు. సీజన్ చివర్లో వీళ్లిద్దరు కలిసిపోతారేమో అని అందరూ అనుకున్నారు కానీ, ఎవరి జీవితాలను వాళ్ళు చూసుకుంటున్నట్టుగా సీజన్ ని చివర్లో ముగించారు. మరి రెండవ సీజన్ లో అయిన ఒకే కుటుంబం లాగా వీళ్లిద్దరు కలిసిపోతారా లేదా అనేది చూడాలి. మొదటి సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. రెండవ సీజన్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారట. అంటే ఈ సీజన్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు అన్నమాట.