Ram Gopal Varma: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న వారిలో ఒకరు రామ్ గోపాల్ వర్మ(Ram Goplaal Varma). ఒకే మూస లో వెళ్తున్న కమర్షియల్ సినిమా ఫార్మటు ని మార్చిన లెజెండ్. శివ , గాయం, సత్య , కంపెనీ, రంగీలా, సర్కార్, రక్త చరిత్ర ఇలా ఒక్కటా రెండా, ఎన్నో సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించి ఆడియన్స్ కి అద్బుయుతమైన థియేట్రికల్ అనుభూతిని అందించాడు. కానీ ఈమధ్య ఆయన పూర్తిగా గాడి తప్పి, తన మూడ్ కి తగ్గ సినిమాలు చేస్తూ స్థాయిని తగ్గించుకున్నాడు. కానీ ఆయన తల్చుకుంటే మళ్లీ కం బ్యాక్ ఇవ్వగలడు, అందులో ఎలాంటి సందేహం లేదంటూ సందీప్ వంగ లాంటి డైరెక్టర్స్ కూడా పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇన్ని రోజులు రామ్ గోపాల్ వర్మ లో ఆడియన్స్ కేవలం ఒక డైరెక్టర్ గా మాత్రమే చూసారు.
కానీ మొట్టమొదటిసారి ఆయన హీరో గా వెండితెర పై కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు షో మ్యాన్(show man) అనే టైటిల్ ని పెట్టారు. మ్యాడ్ మాన్ స్టర్ అనేది క్యాప్షన్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. దీన్ని చూసిన ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. రామ్ గోపాల్ వర్మ హీరోనా?, లుక్ కూడా అదిరిపోయింది గా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతం లో రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీం’ అనే చెత్త హారర్ చిత్రం చేసాడు గుర్తుందా..?, ఈ సినిమాని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించాడు. ఇప్పుడు ఈ షో మ్యాన్ సినిమాకు కూడా ఆయనే నిర్మాత. ఈ చిత్రం ద్వారా నూతన్ అనే దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు.
ఇకపోతే ఈ చిత్రం లో విలన్ గా సీనియర్ హీరో సుమన్ నటించబోతున్నాడట. ఒకప్పుడు హీరో గా సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ గా కొనసాగిన సుమన్, పెద్ద వయస్సు వచ్చిన తర్వాత ఎక్కువగా విలన్ రోల్స్, క్యారక్టర్ రోల్స్ చేస్తున్నాడు. అయితే ఈమధ్య కాలం లో ఆయన సినిమాల్లో కనిపించడం లేదు. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రం తో కం బ్యాక్ ఇస్తున్నాడు. ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయింది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ చిత్రానికి కూడా రామ్ గోపాల్ వర్మ నే దర్శకత్వం వహించి ఉంటే బాగుండేది అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.